Table of Contents
Pathaan Telugu Review.. బాలీవుడ్ బాద్ షా ‘కింగ్’ షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘పఠాన్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
మరో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే ఈ సినిమాలో హీరోయిన్.
సినిమాలో కంటెంట్ ఏముంటుంది.? అన్న విషయాన్ని పక్కన పెట్టి, సినిమాలో దీపికా పడుకొనే – షారుఖ్ ఖాన్ మధ్య చిత్రీకరించిన ఓ పాట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
పాట వివాదంతో వచ్చిన పబ్లిసిటీ..
‘బేషరమ్..’ అంటూ సాగే పాట కారణంగా పుట్టిన వివాదం, అది ఈ సినిమాకి ఇచ్చిన విపరీతమైన పబ్లిసిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
కాషాయ బికినీ వేయడమేంటి.? అంటూ కొందరు చిత్రంగా ప్రశ్నించి, దీపిక పడుకొనేని చంపేస్తామనే వార్నింగులు కూడా ఇచ్చారు.
సెన్సార్ ఎలాగో పూర్తయ్యింది.. కొన్ని కత్తిరింపులూ పడ్డాయ్. చివరికి సినిమా థియేటర్లలోకి వచ్చింది.
Pathaan Telugu Review.. జస్ట్ మైండ్ బ్లోయింగ్.. అంతేనా.?
మెజార్టీ రివ్యూలు, ‘జస్ట్ మైండ్ బ్లోయింగ్’ అంటున్నాయి. సినిమాలో యాక్షన్ బ్లాక్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారని దాదాపు అన్ని రివ్యూల్లోనూ పేర్కొంటున్నారు.

సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ సినిమాకే హైలైట్ అనేది చాలామంది అభిప్రాయం. మరోపక్క, దీపిక పడుకొనే బికినీల మీద రేగిన వివాదం సంగతెలా వున్నా, తెరపై ఆమె చేసిన పోరాటాలు అద్భుతమంటున్నారు.
కింగ్ ఈజ్ బ్యాక్..
లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌గా వచ్చాడంటూ ‘కింగ్’ షారుక్ ఖాన్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సినీ విమర్శకులు. చాలాకాలం తర్వాత బాలీవుడ్ నిఖార్సయిన హిట్టు కొట్టిందన్నది మెజార్టీ అభిప్రాయం.
Also Read: Mental Bala Krishna.! ఈ ట్రెండింగ్ ఏంది బాలయ్యా.!
కుటుంబంలో డ్రగ్స్ కేసు రేపిన కలవరం దగ్గర్నుంచి, అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని, ‘పఠాన్’ సినిమాతో ఎట్టకేలకు షారుఖ్ ఖాన్ ‘ఊపిరి’ పీల్చుకున్నట్టేనా.?
ఈ స్పై థ్రిల్లర్.. యాక్షన్ లవర్స్‌ని అలరించి, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమేనా.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!