Pawan Kalyan 1000Cr Package.. ఆడెవడో కూశాడట.. వీడెవడో గగ్గోలు పెడుతున్నాడట.! జనసేన అధినేత వెయ్యి కోట్ల ప్యాకేజీ వ్యవహారంపై జరుగుతున్న రచ్చ ఇది.!
రాజకీయాలంటేనే డబ్బు మయం.! కుల, మత, ప్రాంత.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద కథే.! ఇవేవీ లేకుండా రాజకీయాలు నడవడంలేదు.
ఔను, రాజకీయం అనే బురదలో దొర్లుతున్న సోకాల్డ్ పొలిటికల్ వరాహాలకి, అవతలి వ్యక్తులు కాస్త ‘శుభ్రం’గా వుంటే అస్సలు గిట్టదు.!
Pawan Kalyan 1000Cr Package.. ‘కుల’ మీడియా పైత్యం.!
మీడియా.. రాజకీయ పార్టీలకు వత్తాసు పలకడం మామూలే. అందునా, ఇప్పుడు ‘కుల’ మీడియా విశృంఖలత్వాన్ని చూస్తున్నాం.
తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఖచ్చితంగా వుంటుంది.. అదీ టాప్ త్రీలో.!
పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ఎందుకు తీసుకుంటాడు.? కోరుకుంటే, అంతకన్నా మించిన పదవి దక్కుతుంది కదా.?
రాజ్యసభ సీటు దక్కించుకుని, కేంద్ర మంత్రి అయ్యే అవకాశాన్ని పవన్ ఎందుకు వదులుకుంటాడు.?
రాజకీయ నాయకులు మొరగడం మామూలే.! కొత్తగా మీడియా మొరగడం ఎక్కువైపోయింది.!
గ్రామ సింహాలు.. అన్న టైటిల్ కోసం రాజకీయ నాయకులతో పోటీ పడుతున్నారు మీడియా సంస్థల అధినేతలు.!
చెంచాగిరీ విషయంలో పార్టీల కార్యకర్తల్ని మించిపోయి, బొచ్చెలో బిచ్చం కోసం మీడియా అధినేతలు సాగిల పడుతున్న వైనం శోచనీయం.!
అయినా, తెలుగునాట మీడియా ఎక్కడుంది.? అంతా పొలిటికల్ మాఫియానే.. అంటే అది తప్పెలా అవుతుంది.?
Mudra369
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇదే ‘కుల’ మీడియా వెయ్యి కోట్ల ప్యాకేజీ ముద్ర వేసింది. చిత్రమేంటంటే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో ఏకమయ్యాయ్.
వెయ్యి కోట్లు ఎవడబ్బ సొమ్మనీ.? అన్న ఇంగితం లేకుండా పోయింది ఎవరికీ. చిన్న విషయం కాదు వెయ్యి కోట్లంటే.! వ్యవస్థలు చూస్తూ ఊరుకుంటాయా.? ఇలా ప్యాకేజీలు పంచుకుంటూ పోతే.!
ప్రజలేం చేశారు పాపం.?
రాజకీయ నాయకులు తిట్టుకుంటే ఫర్లేదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకీ, తెలంగాణ ప్రజలకీ ఆ తిట్లను ఆపాదించొద్దంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వీడియో విడుదల చేశారు.
Also Read: AlluArjun JrNTR Pushpa Party: పార్టీ లేదా బావా.!
అంతే, మళ్ళీ మొరుగుడు మొదలైంది.! గ్రామ సింహాల నిస్సిగ్గు అరుపులు, వాటికి ‘కుల’ మీడియా బాకా ఊదడం.. సరిపోయింది సంబరం.!
ఇవి కాక, సోషల్ మీడియా కార్మికులొకరు.. మరీ బిచ్చగాళ్ళ కంటే హీనంగా తయారయ్యారు.! అస్సలు బుర్ర పెట్టి ఆలోచించడంలేదు. ఆలోచిస్తే, బాగుపడిపోరూ.?