Pawan Kalyan Appreciates Nidhhi Agerwal.. ఓ సినిమాలో నటించిన నటీ నటులు, ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం వింతేముంది.?
కాకపోతే, ఆ సినిమా ప్రచార బాధ్యతల్ని పూర్తి స్థాయిలో భుజానికెత్తుకోవడం మాత్రం అభినందించదగ్గదే. అది కూడా, ఓ నటి ఆ బాధ్యతని తీసుకుంటే, హేట్సాఫ్ అనకుండా వుండలేం.
‘హరి హర వీర మల్లు’ సినిమా విషయంలో నిధి అగర్వాల్ తీసుకున్న బాధ్యత అంతా ఇంతా కాదు. అందుకే, పవన్ కళ్యాణ్ పదే పదే నిధి అగర్వాల్ పేరుని ప్రస్తావిస్తున్నారు.
Pawan Kalyan Appreciates Nidhhi Agerwal.. గాల్లో తేలినట్టుందే..
‘నిధి అగర్వాల్‌ని చూసి సిగ్గు తెచ్చుకున్నాను..’ అంటూ, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చేసిన వ్యాఖ్యల్ని ఎప్పటికీ మర్చిపోలేం.
నిజానికి, మొదటి నుంచీ పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో కనిపించడానికి అయిష్టత చూపుతూ వుండేవారు.
‘మనం మాట్లాడితే ప్రయోజనమేముంది.? సినిమా మాట్లాడాలి..’ అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. అందులోనూ నిజం లేకపోలేదు.
మిగతా సినిమాలు వేరు.. హరి హర వీర మల్లు వేరు..
‘హరి హర వీర మల్లు’ ఓ ప్రత్యేకమైన సినిమా. దాదాపు ఐదేళ్ళ సమయం పట్టింది సినిమా పూర్తవడానికి. దర్శకుడు కూడా మారిపోయాడు. నిర్మాత నానా ఇబ్బందులూ పడ్డాడు.

ఈ నేపథ్యంలో, ‘హరి హర వీర మల్లు’ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం అయ్యింది పవన్ కళ్యాణ్‌కి. పొలిటికల్ కమిట్మెంట్స్ నేపథ్యంలో, సినిమా ప్రమోషన్స్‌కి పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యమయ్యారు.
కానీ, నిధి అగర్వాల్.. పూర్తి స్థాయిలో సినిమా ప్రచార బాధ్యతల్ని మోసింది. అందుకే, ఆమెని వీలు చిక్కినప్పుడల్లా గుర్తు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.
Also Read: లక్కీ బాంబూ (వెదురు) మీ ఇంట్లో వుందా.?
తాజాగా, ‘ఓజీ’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కూడా నిధి అగర్వాల్ ప్రస్తావన తీసుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
తన గురించి పవన్ కళ్యాణ్ ‘ఓజీ సక్సెస్ సెలబ్రేషన్’లో ప్రస్తావించడం పట్ల నిధి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఉబ్బితబ్బిబ్బయ్యింది.
