Blue Media.. నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిస్తే ‘భార్యల ప్రస్తావన’ ఎందుకు వస్తుంది.? ‘క్షుద్ర పూజల’ చర్చ ఎందుకు జరుగుతుంది.?
అసలు ఇలాంటి అనుమానం వచ్చిందంటే, ఆ అనుమానం వచ్చినోడికి ‘తార్చే’ అలవాటు బాగా వుండి వుండాలి. క్షుద్ర పూజల్లో బోల్డంత ప్రావీణ్యం వుండి వుండాలి.!
యెడ్డి యెంకటీ.. ఇదేం క్షుద్ర పాత్రికేయం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
సినీ నటులే కాదు.. రాజకీయ నాయకులు కూడా..
పక్క పక్కనే తమ సినిమాల షూటింగులు జరుగుతున్నప్పుడు.. ఇద్దరు ప్రముఖ నటులు కలుసుకోవడం వింతేమీ కాదు.
ఆయా చిత్రాలకు నిర్మాతలుగా వ్యవహరించేవారో, దర్శకులో, కొరియోగ్రాఫర్లో.. ఎవరో ఒకరు, ఈ తరహా కలయికకు సంబంధించి లీడ్ తీసుకుంటారు.
కలుసుకున్నాక, ఇద్దరు ప్రముఖులు వివిధ అంశాలపై చర్చించుకోవచ్చుగాక. అక్కడ క్షుద్ర పూజలు, పెళ్ళాల గురించిన చర్చ జరిగిందని ఎలా ఊహిస్తారబ్బా.?
Blue Media ‘తోక’తో వచ్చిన సమస్య ఇది.!
అవతార్ సినిమాలో జంతువుల్లాంటి, పక్షుల్లాంటి ఆకారాలకి, మనుషుల్లాంటి ఆకారాలు.. తమ తోకలతో ముడివేయడం చూస్తుంటాం.
ఇదీ అలాంటిదే.! పేరు చివర్న వుండే ‘తోక’లతో వచ్చే సమస్య ఇది. కుల జాడ్యం సమాజాన్ని ఎలా చీల్చుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చూసుకోవడమనేది జాతీయ సమస్య కాదు.! అంతర్జాతీయ సమస్య అసలే కాదు. అది ఆయన వ్యక్తిగత విషయం.
Also Read: Ram Gopal Varma: పాలకోవాకి ఆర్జీవీ ‘నిజాయితీ’ సర్టిఫికెట్టు.!
ఇక, క్షుద్ర పూజలంటారా.. క్షుద్ర పాత్రేయం ముందు క్షుద్ర పూజలకు అంతగా ప్రాచుర్యం వుండడంలేదు ఈ కాలంలో. యెడ్డి యెంకటీ, కాస్త కులగజ్జి ఆపుకోవయ్యా.!
నీలి చిత్రాలకీ ఓ అర్థం వుంటుందేమో.. కానీ, ఈ నీలి పాత్రికేయానికి అర్థం పర్థం వుండదు. క్యాన్సర్ కంటే భయంకరమైన మహమ్మారి ఈ నీలి క్షుద్ర పాత్రికేయం.!
చివరగా: సెలబ్రిటీల వైవాహిక జీవితాలు, ఎఫైర్ల గురించి వెకిలా ప్రచారాలు చేస్తావ్ సరే, నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా అలాంటి ప్రచారాలు చేస్తే.? అక్రమ సంబంధాల్ని అంటగడితే.? జస్ట్ ఆస్కింగ్.!