Pawan Kalyan Brahmacharyam.. సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం జాతీయ సమస్యగా మారిపోతోంది.!
ముందు ముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం అంతర్జాతీయ సమస్య కూడా అవుతుందేమో.! ప్రపంచ యుద్ధాలు కూడా దీని వల్లనే జరుగుతాయేమో.!
పవన్ కళ్యాణ్ చేసుకున్న ఆ మూడు పెళ్ళిళ్ళ వల్లనే బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి వుండకపోవచ్చు. ఆ పెళ్ళిళ్ళ వల్లనే ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి వుండాలి.!
ఒక్క పెళ్ళి చేసుకుని.. ముప్ఫయ్ మంది స్టెప్నీలతో భంచిక్ నేరమా.?
వైవాహిక జీవితంలో సమస్యలొచ్చిన చట్టబద్ధంగా విడాకుల పద్ధతిని అనుసరించి.. మరో పెళ్ళి చేసుకోవడం నేరమా.?
ఓ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన ఓ సమస్యని.. జాతీయ సమస్యగా మార్చే ప్రయత్నంలోని ‘తేడా’ రాజకీయమేంటి.?
Mudra369
అంతేనా.? ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికించింది కూడా బహుశా పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ వల్లనేనేమో.. అన్న డౌట్ వస్తోంది చాలామందికి.
ఏం ఖర్మ ఇది.?
ఓ వ్యక్తి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. మొదటి పెళ్ళి కొన్ని కారణాల వల్ల పెటాకులయ్యింది. రెండో పెళ్ళి కూడా అంతే. ఇందులో వింతేముంది.?
ఆమిర్ ఖాన్‌కి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి.? సూపర్ స్టార్ కృష్ణ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే విజయ నిర్మలను రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు.?
లెక్కలు తీస్తే చాలానే వుంటాయ్.! స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా లేటు వయసులో రెండో పెళ్ళి చేసుకున్నారాయె.!
Pawan Kalyan Brahmacharyam.. బ్రహ్మచర్యం ఆలోచన.. తప్పేముంది.?
తాను బ్రహ్మచర్యం పాటించాలని పవన్ కళ్యాణ్ చిన్నప్పుడెప్పుడో అనుకున్నారట. ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో (అన్‌స్టాపబుల్ వేదికగా) చెప్పారు.
తప్పేముంది.? చిన్నప్పటి ఆలోచనలకీ, పెద్దయ్యాక పరిస్థితులకీ చాలా తేడా వుంటుంది.
ఇది కూడా కొందరు ‘తేడాగాళ్ళకి’ ‘తేడా’గా కనిపించడంతో.. అంతకన్నా ‘తేడా’గా పవన్ కళ్యాణ్ మీద విమర్శల కోసం వాడేస్తున్నారు.. తేడా కథనాల్ని వండి వడ్డించేస్తున్నారు.
Also Read: సాయం చేసి ఓడిపోయావ్ చిరూ.! అందుకే నువ్వు ‘విజేత’వి.!
అయినా, పవన్ కళ్యాణ్ వల్లగానీ.. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్లగానీ సమాజానికి వచ్చిన నష్టమేంటి.? కష్టార్జితాన్ని జనం కోసం ఖర్చు చేస్తున్నోడి మీద ఎందుకీ వెకిలి ప్రచారం.?
ఔను, బాలయ్య అన్నదే నిజం. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేసేవాళ్ళంతా ఊర కుక్కలతో సమానం.!