Pawan Kalyan Chief Minister.. ఎప్పుడూ విమర్శించడమే పనిగా పెట్టుకున్నోళ్ళకి కూడా ఒక్కోసారి, ‘తప్పు కదా.! మనం అడ్డగోలుగా విమర్శిస్తున్నామేమో.!’ అనిపిస్తే, అదీ రియలైజేషన్ అంటే.
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ విషయంలో చాలామందికి ‘ఆయన్ని ఎప్పుడూ విమర్శించడమే పని’.! ఔను, పవన్ కళ్యాణ్ వల్ల ఎవరికైనా పది పైసలు నష్టం వచ్చిందా రాజకీయాల్లో.?
రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అసలు రాజకీయాల కారణంగా కోల్పోయిన సమయాన్ని, సినిమా పరంగా లెక్కేసుకుంటే, కోట్లాది రూపాయల నష్టం పవన్ కళ్యాణ్‌కి వాటిల్లింది.
తాను సినిమాల్లో సంపాదించిన సంపాదనను, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఖర్చు చేస్తున్నారు. చేతనైనంత మేర, సమాజంలోని వివిధ వర్గాలకు సాయం చేస్తూ వెళుతున్నారు పవన్ కళ్యాణ్.
సీఎం పవన్ కళ్యాణ్.!
పవన్ కళ్యాణ్ సినిమా హిట్టయితే.. చాలామందికి ఆయన సాయపడగలగుతాడు. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా, ఆయన చాలామందికి సాయపడగలుగుతాడు. హిట్టూ, ఫ్లాపు.. వీటికి అతీతం పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్.!
తాజాగా, పవన్ కళ్యాణ్ రాజకీయంగా తన పర్యటనల కోసం కొత్త కాన్వాయ్‌ని కొనుగోలు చేశారట. ఓ రాజకీయ పార్టీ అధినేత సొంత ఖర్చులతో కాన్వాయ్ కొనుగోలు చేయడమంటే, ఇప్పుడున్న రాజకీయాల్లో విచిత్రమే.

అఫిడవిట్లలో తమకు సొంత కారు కూడా లేదని చెప్పే లఫూట్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వెరీ వెరీ స్పెషల్ మరి.! అందుకే, ఏకంగా బోల్డన్ని కొత్త కార్లతో సొంత కాన్వాయ్ ఏర్పాటు చేసుకున్నారు.
ఇంకేముంది.? ‘పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి కల వచ్చేసింది..’ అంటూ ఆయన మీద కొత్త కోణంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ మీద ఏడ్చిన సోకాల్డ్ ‘వల్లకాడు’ మీడియానే, ఇప్పుడాయన గురించి గొప్పగా మాట్లాడుతోంది.
Pawan Kalyan Chief Minister.. పవర్ కళ్యాణ్.! ద్వేషించేవారూ ఒప్పుకోవాల్సిందే.!
ఓ ఎనిమిదో, పదో కొత్త కార్లను కొనుగోలు చేసి, పార్టీ కార్యాలయంలో పెట్టుకుంటే, దాన్ని కాన్వాయ్‌గా ఎవరో అభివర్ణించేసి, పవన్ కళ్యాణ్‌కి సీఎం కళ వచ్చేసిందనుకుంటే పొరపాటు. అదే నిజమనే భ్రమల్లో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ వుండరు.
పది కార్లేం ఖర్మ.. వంద కార్లు కొనుగోలు చేసే సత్తా పవన్ కళ్యాణ్‌కి వుంది. ఆయన కోరుకుంటే వంద కార్లేం ఖర్మ.. వెయ్యి కార్లు, లక్ష కార్లు వచ్చి వాలతాయి ఆయన ముందర.
Also Read: ఫెయిలై ‘పోయారు’.! మేమేటి సేత్తాం.?
గెలిచినా ఓడినా పవన్ కళ్యాణ్ ‘సీఎం’గానే వుంటారు. సీఎం అంటే, కామన్ మ్యాన్.! దటీజ్ పవన్ కళ్యాణ్.