Table of Contents
Pawan Kalyan Donation Politics.. రాజకీయాలంటే.? దోచుకోవడం.! దోచుకోవడానికి కాక, ప్రజలకు నిజంగానే సేవ చేసెయ్యడానికి రాజకీయాల్లోకి ఎవరైనా వస్తారా.?
ఔను, రాజకీయాలంటే ఇదే భావన నెలకొంది.. అటు రాజకీయ నాయకుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ.! ప్రజలు విసిగిపోయారు.. కానీ, ఆ ‘దోపిడీ’ని తప్పక భరిస్తున్నారు.!
ప్రజా ధనంతో పబ్లిసిటీ స్టంట్లు చేయాలి.. బటన్లు నొక్కాలి, సొంత మీడియాకి దోచి పెట్టుకోవాలి. కార్యకర్తలకు వాలంటీర్ ముసుగేసి, ప్రజాధనాన్ని దోచిపెట్టాలి.
ఇదీ వైసీపీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దోపిడీ.! రోజులు మారాయ్. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అందునా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్లోకి వచ్చారు.
Pawan Kalyan Donation Politics.. ఉప ముఖ్యమంత్రి హోదాలో.. విరివిగా విరాళాలు..
పూర్తిస్థాయి పవర్ కాదు, ప్రస్తుతానికి ఆయన ఉప ముఖ్యమంత్రి మాత్రమే.! అయినాగానీ, రాజకీయానికి అసలు సిసలు అర్థం చెబుతున్నారు. ‘పవర్’ అంటే ఏంటో చూపిస్తున్నారు.
విజయవాడలో వరదలు వస్తే, ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్నిచ్చారు పవన్ కళ్యాణ్. అంతే కాదు, మరో నాలుగు కోట్ల రూపాయల్ని సుమారు 400 గ్రామ పంచాయితీల కోసం విరాళమిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో వరదల నేపథ్యంలో ఇంకో కోటి విరాళమిచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇదంతా తన కష్టార్జితమే.
మామూలుగా విపత్తులు సంభవిస్తే, అధికారంలో వున్నోళ్ళు ఏం చేస్తారు.? ఆయా శాఖలకు నిధుల విడుదల.. అని చెప్పి, అందులోనూ సొంత పార్టీ నాయకులు దోచుకునేందుకు తెరలేపుతారు.
స్వార్జితం.. జనానికి సాయపడేందుకోసం.!
ఇక్కడ, పవన్ కళ్యాణ్ తన స్వార్జితాన్ని ఖర్చు చేస్తున్నారు. అది అవినీతి రూపంలో పక్కదారి పట్టేందుకు అస్సలు ఆస్కారం వుండదు.
ఓ స్కూల్ ప్లే గ్రౌండ్ కోసం వ్యక్తిగతంగా 60 లక్షలు ఖర్చు చేసి, భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్.
విజయనగరంలో అతిసార ప్రబలి 11 మంది ప్రాణాలు కోల్పోతే, బాధిత కుటుంబాలకి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం, అదీ వ్యక్తిగతంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేయడం గమనార్హం.
సాయం చేసినా తప్పేనా.? అంటే, ‘అలా ఎలా సాయం చేస్తారు.? ప్రభుత్వంలో వున్నారు కదా.. ఎక్స్గ్రేషియా ప్రకటించాలి కదా.?’ అంటూ వితండవాదానికి తెరలేపుతున్నారు.
ఎక్స్గ్రేషియా అనేది అదనం. అధికారులు, అన్ని విషయాల్నీ పరిగణనలోకి తీసుకుని, ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. అంతకన్నా ముందు, బాధిత కుటుంబాలకు కొంత సాంత్వన కలిగించేలా పవన్ కళ్యాణ్ ఈ సాయం చేశారు.
రాజకీయమంటే దోపిడీ కాదు.. ప్రజా సేవ.!
ఔను, రాజకీయమంటే ప్రజా సేవ.! కానీ, రాజకీయమంటే ‘దోపిడీ’గా మార్చేశారు కొందరు.! మళ్ళీ రాజకీయానికి కొత్త అర్థం చెప్పిన సరికొత్త నాయకుడికి ప్రజలు ‘పవర్’ ఇచ్చారు.!
వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.! సాయం ఆయన ఈ రోజు కొత్తగా చేస్తున్నది కాదు. రాజకీయాల్లోకి రాకముందు నుంచీ చేస్తున్నారు.
పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాక కూడా, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పెద్దని కోల్పోయిన కౌలు రైతు కుటుంబాలకు కోట్లాది రూపాయల సాయం చేసిన గొప్ప మనిషి పవన్ కళ్యాణ్.
అయినా, ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేసి ‘ఓటు బ్యాంకు’ రాజకీయాలు చేయాలిగానీ, పవన్ కళ్యాణ్ ఏంటీ.. స్వార్జితాన్ని.. కష్టాల్లో వున్నవారిని ఆదుకోవడం కోసం వృధా చేస్తారు.? అన్న ప్రశ్న చాలా సార్లు వినిపిస్తుంటుంది.
అదే పవన్ కళ్యాణ్ ప్రత్యేకత. అందుకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, మిగతా రాజకీయ నాయకులకంటే భిన్నమైన వ్యక్తిగా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.