Pawan Kalyan HHVM Release.. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా రాబోతోంది. అదే ‘హరి హర వీర మల్లు’. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇది.!
అనేక బాలారిష్టాల్ని దాటుకుని, ‘హరి హర వీర మల్లు’ విడుదలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం వల్లే, ఈ సినిమా ఆలస్యానికి అసలు కారణం.
దర్శకుడు క్రిష్ ప్రారంభించిన ‘హరి హర వీర మల్లు’ ప్రస్తుతం, నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ చేతుల మీదుగా ఓ కొలిక్కి వచ్చింది.
మే 9న సినిమా విడుదల.. అంటూ, గతంలోనే ప్రకటన వచ్చింది. అయితే, పవన్ కళ్యాణ్ మీద షూట్ చేయాల్సిన కొంత పార్ట్ పెండింగ్‌లో వుండిపోయింది.
Pawan Kalyan HHVM Release.. రిలీజ్ డేట్ విషయంలో ఏంటా కాన్ఫిడెన్సు.?
తాజాగా, చిత్ర యూనిట్ ఇంకోసారి ‘మే 9న సినిమా రిలీజ్’ అంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డబ్బింగ్, వీఎఫ్ఎక్స్, రీ-రికార్డింగ్.. అన్నీ, శరవేగంగా జరుగుతున్నానీ పేర్కొంది.
కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ ‘హరి హర వీర మల్లు’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.
కాగా, తొలుత ఒకే భాగంలో సినిమా తీసెయ్యాలని అనుకున్నా, ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు భాగాలుగా ‘హరి హర వీర మల్లు’ సినిమాని మార్చారు.
తొలి భాగమే మే 9న విడుదల కానుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి వీలుగా వుండేలా, అమరావతి పరిసర ప్రాంతాల్లో సెట్స్ వేసి, అక్కడే కీలక భాగాల్ని ఇటీవల షూట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇంతకీ, పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన పెండింగ్ వర్క్ ఏమయ్యింది.? ఇదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.! ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సింగపూర్‌లో వున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే.