Home » నిందలేయడం తేలికే.! నిలదొక్కుకోవడమే కష్టం.!

నిందలేయడం తేలికే.! నిలదొక్కుకోవడమే కష్టం.!

by hellomudra
0 comments
Pawan Kalyan

Pawan Kalyan JD Janasena.. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందర జన సేన పార్టీలో చేరారు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ.

అసలు పేరు వీవీ లక్ష్మినారాయణ అయినా, జేడీ లక్ష్మినారాయణగానే ఆయన సుపరిచితులు.

విశాఖ లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసిన జేడీ, ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయితేనేం, చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సంపాదించుకున్నారు.

జన సేన పార్టీలోనే గనుక జేడీ లక్ష్మినారాయణ కొనసాగి వుంటే, 2024 ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా గెలిచేవారు. కానీ, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే, ఆయన జన సేన పార్టీకి దూరమయ్యారు.

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడం ఇష్టం లేక, జన సేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జేడీ ప్రకటించారు. రాజకీయాలు, సినిమాలు.. రెండు పడవల ప్రయాణమేంటి.? అని ప్రశ్నించేశారు జేడీ.

Pawan Kalyan JD Janasena.. సొంత పార్టీ పెట్టి.. రాజకీయాలకు దూరమై.. ఉద్యోగం వెతుక్కుని..

కట్ చేస్తే, జేడీ లక్ష్మినారాయణ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు.. కానీ, ఆ పార్టీని గాలికొదిలేసి, ఇటీవల ఓ ఉద్యోగం చూసుకున్నారు.

రాజకీయాల్లో అనుకున్నది జరగకపోతే, బతుకుదెరువు కోసం ఉద్యోగం వెతుక్కోవడం తప్పేమీ కాదు. ఈ విషయంలో జేడీ లక్ష్మినారాయణని తప్పు పట్టలేం.

ఒకవేళ తాను స్థాపించిన పార్టీకి ఆర్థిక అండదండల కోసమే ఆయన ఉద్యోగం చేయడానికి సిద్ధమైతే.. అదీ మంచిదే.

కానీ, పవన్ కళ్యాణ్ చేసింది కూడా అదే కదా.! పార్టీకి ఆర్థిక జవసత్వాలు అందించేందుకు, తనకు తెలిసిన నటనను ఎంచుకున్నారు. సినిమాల్లో నటిస్తున్నారు.

సినిమాల్లో సంపాదించిన సొమ్ములో సింహభాగం పార్టీ కోసం, సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తూ, మిగిలిన మొత్తాన్ని తన కుటుంబ పోషణ కోసం పవన్ కళ్యాణ్ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.

సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మినారాయణ, పవన్ కళ్యాణ్‌ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్.

చాలా తేలిగ్గానే లక్ష్మినారాయణ నిందలు వేసేశారు పవన్ కళ్యాణ్. కానీ, రాజకీయాల్లో నిలబడలేకపోయారు. చేయని తప్పుకి నిందలు మోసిన పవన్ కళ్యాణ్, రాజకీయంగా నిలదొక్కుకున్నారు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group