Table of Contents
Pawan Kalyan Kushi.. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు.. తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి అతని ఇంట్రడక్షన్ ఇదే.!
కానీ, ఒకటీ.. రెండూ.. మూడూ.. ఇలా సినిమాల సంఖ్య పెరుగేకొద్దీ, ‘పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి’ అనే స్థాయికి పరిస్థితి మారింంది.!
‘అన్నయ్యను మించిన తమ్ముడు..’ అనే ప్రస్తావనను అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంజాయ్ చేస్తారు.! ఔను, అన్నయ్యకే స్టంట్ కొరియోగ్రాఫర్‌గా తమ్ముడు పవన్ కళ్యాణ్ పని చేశాడు మరి.!
Pawan Kalyan Kushi.. ఖుషి.. ఆ కిక్కే వేరప్పా.!
‘ఖుషి’ సినిమాని థియేటర్లలో చూసిన సగటు సినీ ప్రేక్షకుడికి.. అందునా యూత్‌కి ఆ సినిమా మీద మమకారం ఎప్పటికీ తగ్గిపోదు.!
ఔను, ‘ఖుషి’ సినిమాలోని పాట వినిపించినా, డైలాగ్ వినిపించినా.. ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోతుంటారు. అదే ‘ఖుషి’ ప్రత్యేకత.!

హీరోయిన్‌తో రొమాన్స్.. ఓ ఐటమ్ సాంగ్ లాంటిదొకటి.. యాక్షన్ బ్లాక్స్.. ఇంతే కాదు, అంతకు మించి సినిమాలో ‘మజా’ వుంటుంది. ఆ ‘పవర్ కిక్’ గురించి మాటల్లో వర్ణించలేం.
‘ఖుషి’ సినిమాలోని పాటలు, డాన్సులు, డైలాగ్స్.. ప్రతి విభాగం గురించీ ఓ పుస్తకం రాసెయ్యాలేమో.. అంతలా అప్పటి యూత్‌ని తనవైపుకు తిప్పుకుంది.
రీ-రిలీజ్.. మళ్ళీ ఆనాటి సంబరం..
ఆనాటి సంబరం.. ఔను, అంతకు మించి సంబరం.! ‘ఖుసి’ రి-రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఓటీటీ వేదికలపై, యూ ట్యూబ్‌లో ఈ సినిమా అందుబాటులో వుంది.
Also Read: చిరంజీవి, ఊర్వశి.. ఓ అయస్కాంతం.!
కానీ, థియేటర్లలో ఆ సినిమాని ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరప్పా.! అందుకే, థియేటర్లకు జనం పోటెత్తారు.
పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎపిసోడ్స్.. పవన్ కళ్యాణ్ టీజింగ్ సీన్స్.. ఒకటేమిటి.? ‘ఖుషి’ గురించి చెప్పుకోవాలంటే.. ఈ మాత్రం స్పేస్ సరిపోదు. అసలు ఎంత సమయం వున్నా సరిపోదు.!

ఆ మాటకొస్తే, ‘ఖుషి’ మాస్టర్ పీస్ కాకపోయినా.. ‘ఖుషి’లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ మాత్రం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆప్టర్ అంతే.!
ఫైనల్ టచ్.!
నువ్వేమన్నా చిరంజీవివా.? అన్న ప్రశ్న దగ్గర్నుంచి.. నువ్వేమన్నా పవన్ కళ్యాణ్‌వా.? అన్న వరకూ ట్రెండ్ మారిందంటే.. దటీజ్ ‘పవన్ కళ్యాణ్ ఖుషి’.!
యూత్, ‘ఖుషి’ ఫీవర్‌లో మునిగిపోయింది. దాన్నుంచి, ఆ జనరేషన్.. ఇప్పుడు నాలుగు పదుల వయసులోకి వచ్చినాగానీ.. ఆ యూత్ ఫీలింగ్ అలాగే మెయిన్‌టెయిన్ చేస్తోంది.!
‘నువ్వు గుడుంబా సత్తి కావొచ్చు.. తొక్కలో సత్తి కావొచ్చు.. బట్ ఐ డోన్ట్ కేర్.. బికాజ్ ఐ యామ్ రాయిల్ బెంగాల్ టైగర్ సిద్దు.. సిద్దార్ధ రాయ్..’ ఈ డైలాగ్.. దాంతో వచ్చే రీసౌండ్.. అప్పటికీ, ఇప్పటికీ.. ఇప్పటికీ అలా మార్మోగుతూనే వుంటుంది సినిమాని థియేటర్లలో చూసినోళ్ళకి.. ఎనీ డౌట్స్.?