Pawan Kalyan ఏమవుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో కలిస్తే.!
రాజకీయాల్లో శాశ్వత శతృవులు వుండరు.. శాశ్వతంగా మిత్రులుగానూ వుండిపోలేరు. పొలిటికల్ ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్.
2024 ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ వుంది. ఈలోగా రాజకీయాలు ఎలాగైనా మారొచ్చు. 2014లో టీడీపీకి జనసేన మద్దతిచ్చింది. 2019 ఎన్నికలకొచ్చేసరికి టీడీపీ – జనసేన రాజకీయ ప్రత్యర్థులు.
సో, 2024లో ఏం జరగబోతోందన్నది ఇప్పుడే ఊహించలేం. ఇద్దరు రాజకీయ ప్రముఖులు.. వేర్వేరు పార్టీలకు చెందిన అధినేతలు భేటీ అయితే, అదొక హాట్ టాపిక్ అవుతుందంతే.
Pawan Kalyan.. భయం.. టన్నుల్లో.!
కానీ, పవన్ కళ్యాణ్ చుట్టూ కొందరికి కొన్ని భయాలున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళినా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగ్గరకు వెళ్ళినా.. భయంతో గిలగిలా కొట్టుకుంటున్నారు.
కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేశాడు పవన్ కళ్యాణ్.. అంటూ వెర్రి కేకలు పెడుతున్నాడు రాజకీయాలతో సంబంధం లేని సినీ ప్రముఖుడొకడు.
కీలకమైన పదవుల్లో వున్నవారు తమ స్థాయిని మరిచి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు.
తమ తమ శాఖల వ్యవహారాలు పట్టని మంత్రులు సైతం, సిగ్గూ ఎగ్గూ వదిలేసి పవన్ కళ్యాణ్ మీద అవాకులు చెవాకులు పేలుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
పాచి నోళ్ళు అంతే..
‘పాచి నోళ్ళు’ అనేశారు జనసేన అధినేత (Jana Sena Party), అలా ‘ఏడుస్తున్నవారిని’ చూసి. ఇదంతా పవన్ కళ్యాణ్ చేస్తున్న పొలిటికల్ ర్యాగింగ్ వల్లనేనా.? అంటే, ఔననే అనాలేమో.!
Also Read: ‘చెత్త’రాంగి.! డిక్కీ బలిసిన ‘పొలిటికల్’ కోడి.!
రాజకీయ ప్రత్యర్థులు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, తాము తమ స్థాయిని మర్చిపోయి ఏడవడం ద్వారా.. తామే జనసేన అధినేతకి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నామని.!
ఒక్క మాటలో చెప్పాలంటే, తన చర్యల ద్వారా జనసేన అధినేత (Janasenani), చాలా సింపుల్‌గా.. తన రాజకీయ ప్రత్యర్థుల్ని రోడ్డున పడేస్తున్నారు… కాదు కాదు, వాళ్ళంతట వాళ్ళే రోడ్డున పడేలా చేస్తున్నారు.
ఇది కదా వ్యూహాత్మక రాజకీయమంటే.!