ఔను, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Political Blunder) తప్పు చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయం.. ఏదీ కలిసి రావట్లేదు. ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎవరి కోసమైతే పోరాడతారో, వాళ్ళే.. ఆయన్ని వెన్నుపోటు పొడుస్తారు. బలవంతుడు బెదిరిస్తే, బక్కోడు బెదిరిపోవడం మామూలే.. అని సినిమాటిక్ డైలాగ్ చెప్పి, హీరో తన హీరోయిజం ప్రదర్శిస్తాడు.
సినిమా వేరు, నిజ జీవితం వేరు. ఔను, సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినీ పరిశ్రమ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏం చెప్పింది.. ‘ప్రభుత్వాల సహకారం లేకపోతే, అసలు సినిమా మనుగడే లేదు’ అని తేల్చేసింది. కానీ, ‘మన హక్కు.. మనం బలంగా నిలబడదాం..’ అని పరిశ్రమకు పవన్ సూచించాడు. అదే పవన్ కళ్యాణ్ చేసిన పెద్ద తప్పుగా మారింది.
పవనిజం.. ఆ నిజం బతికే కాలమా ఇది.?
2019 ఎన్నికల్లో జనసేనను ప్రజలే ఓడించారు. కానీ, ‘ప్రజలు నన్ను ఓడించలేదు.. నన్ను కొంత మంది నమ్మారు, గెలిపించేందుకు ప్రయత్నించారు.. వారి కోసం.. వ్యవస్థలో మార్పు కోసం నిలబడ్తాను..’ అని చెప్పారు పవన్ కళ్యాణ్. ఎప్పుడు.? ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ వాస్తవాల్ని తెలుసుకుంటారు.?
Also Read: ఆర్థిక నేరస్తులు ఓకే.. Sonu Sood నాట్ ఓకే.?
మంచి చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు అనుకున్నా, ఆయనకు ‘చెడు’ ఎదురవుతోంది. ‘నువ్వు చేసింది తప్పు..’ అని పదే పదే సమాజం అతన్ని ఎత్తి చూపుతోంది. సమాజంలో కొందరు మాత్రమే ఆయన్ని తప్పు పడుతున్నారు. మిగతావారు మౌనం దాల్చుతున్నారు. దాంతో, పవన్ వాదనకు బలం చేకూరడంలేదు.
పరిశ్రమ సమస్యల్ని పవన్ ఎలుగెత్తి చాటితే, గట్టిగా నలుగురు కూడా సినీ పరిశ్రమ నుంచి ఆయనకు మద్దతు పలకలేదు. ఎవరి కోసం పవన్ గొంతు చించుకున్నారు.? అవసరమైనప్పుడు ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్ళి ‘దేహీ’ అనుకోవచ్చనే భావనలో వున్నవారి గురించి పవన్ ఆలోచించాల్సిన పనే లేదు.
మార్పు అసాధ్యం..
ప్యాకేజీ అనీ, ఇంకోటనీ.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఔను, పవన్ కళ్యాణ్.. నిజం తరఫున నిలబడాలనుకుని పెద్ద తప్పే చేశారు. ఇకనైనా పవన్ ఆ తప్పు సరిదిద్దుకోవాల్సిందే. కరెన్సీ నోటుకి లొంగిపోయి, వంగిపోయి ఓట్లేసేవాళ్ళని ఉద్ధరించాలని పవన్ కళ్యాణ్ అనుకోవడమేంటి.? అదే ఆయన చేస్తున్న అతి పెద్ద తప్పు.
Also Read: 75 ఏళ్ళ స్వాతంత్ర్యం.. జరుగుతోందా న్యాయం.?
పవన్ కళ్యాణ్ విషయంలో అభిమానుల అత్యుత్సాహంలో కూడా అర్థం లేదు. వారిచ్చే ఉత్సాహం పవన్ కళ్యాణ్‌ని మరింతగా తప్పు దారిలో నడిపిస్తోంది. ఔను, ఈ రోజు మంచి ఆలోచన చేస్తే, అది తప్పుడు ఆలోచనే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Political Blunder) కంటే ముందు పవన్ అభిమానుల్లో మార్పు రావాల్సి వుందేమో.!