Pawan Kalyan Political Seva.. ఔను కదా.! పవన్ కళ్యాణ్ కూడా ఓ మామూల మనిషే.! పవన్ కళ్యాణ్ కంటే పెద్ద స్టార్లు సినీ రంగంలో వున్నారు.!
అంతకు ముందు వరకు సినిమా హీరోలకి అభిమానులుండేవారు. పవన్ కళ్యాణ్ విషయంలో అలా కాదు, ‘పవనిజం’ అంటూ అభిమానానికి కొత్త అర్థం పుట్టుకొచ్చింది.
నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కాదు.! పవన్ కళ్యాణ్‌కి ఫాలోవర్‌ని.! ఈ మాట చాలాకాలం క్రితం విన్నప్పుడు ఒకింత ఆశ్చర్యం కలిగింది.
సరే, పవన్ కళ్యాణ్ ఫాలోవర్‌వి కదా.? ఏం చేస్తావేంటి.? అన్న ప్రశ్న, విడివిడిగా కొందరికి సంధించినప్పుడు.. సమాజం గురించి ఆలోచిస్తా.. చేయగలిగినంత మంచి నా చుట్టు పక్కల వున్నవాళ్ళకి చేస్తా.. అన్న సమాధానం వినిపించింది.
ఆపదలో వున్నవారిని ఆదుకోవడం.. కాస్తో కూస్తో డబ్బులు సాయం చేయడం.. అంతేనా.? అని ప్రశ్నిస్తే.. అంతకు మించి.. అంటూ అట్నుంచి సమాధానం వచ్చేది.
Pawan Kalyan Political Seva.. దేశ భక్తి.. దేశం పట్ల బాధ్యత..
దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ దేశ భక్తి వుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొందరికి మాత్రం బాధ్యత వుంటుంది. ఆ మాట పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఎక్కువగా వినిపిస్తుంటుంది.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక.. అంటే, మరీ ముఖ్యంగా జనసేన పార్టీని స్థాపించాక.. సొంత పార్టీ జెండా కంటే ఎక్కువగా జాతీయ జెండాని పట్టుకుని కనిపిస్తుంటారాయన.

ఇది దేశం పట్ల బాధ్యత. సైనిక సంక్షేమం కోసం విరాళాలు ఇచ్చినా.. దేశ భక్తిని పెంపొందించే మాటల్ని రాజకీయ ప్రసంగాల్లో చేర్చినా.. అది ఆయనకి మాత్రమే ప్రత్యేకం.. అన్నట్లుండే వ్యక్తిత్వం.!
ఆయనలా వుండటం చాలా చాలా కష్టం.! అన్న మాట అప్పట్లో గట్టిగా వినిపించేది. ఇప్పుడు, ఆయనలా వుండటం అసాధ్యం.. అన్న మాట వినిపిస్తోంది.
గౌరవ ప్రదమైన ఓటమి..
పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయాడు.! అంటే, ప్రజల నుంచి ఛీత్కారం వచ్చినట్లేనంటారు కొందరు.!
కానీ, ప్రజల్ని గెలిపించే క్రమంలో ఓడిపోవడం కూడా గౌరవమేనంటారాయన.! అంతే కదా.!

ఆర్థిక ఇబ్బందుల్లో వున్న కౌలు రైతుల కుటుంబాల్ని ఆదుకోవడానికి చేసిన ఖర్చుని, ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు చేసి వుంటే.. జనసేన కొన్ని సీట్లలో అయినా గెలిచేది కదా.?
గెలవడం అంటే ఇదీ.! మనిషిగా గెలవాలి.! రాజకీయ నాయకుడిగా గెలవడమంటే అడ్డదార్లు తొక్కాలి. తద్వారా ప్రజాస్వామ్యానికి పాతరేసినట్లే.!
Also Read: చంద్రయాన రాజకీయం.! నవ్విపోదురుగాక.!
ఉన్నతమైన ఆలోచనలు.. ఉన్నతమైన వ్యక్తిత్వం.! ఇవి ఊరకనే రావు.! ఎవరేమనుకున్నా, రాజకీయమంటే సేవ.. అన్న భావనతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వున్నారు.
ఔను, పవన్ కళ్యాణ్‌లా (Janasenani Pawan Kalyan) వుండటం అసాధ్యం.! అదే ఆయన గొప్పతనం.!
పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) గెలవడమంటే.. అది ప్రజలు గెలిచినప్పుడే జరుగుతుంది.!
ప్రజల్ని పల్లకీ ఎక్కించడమే జనసేన గెలుపు.. అని పదే పదే జనసేనాని చెప్పేది కూడా అందుకే.!