Pawan Kalyan Rejects Salary.. శాసన సభ్యుడిగా తనకు వచ్చే గౌరవ వేతనాన్ని తీసుకోకూడదని జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్య ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
ఇంతకు ముందు ఓ సందర్భంలో మాట్లాడుతూ, ‘గౌరవ వేతనం తీసుకుంటాను. ఎందుకంటే, అది ప్రజా ధనం. ఆ సొమ్ము తీసుకుంటే, అనుక్షణం నాకు బాధ్యతని గుర్తు చేస్తుంది..’ అని చెప్పారు పవన్ కళ్యాణ్.
కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూశాక, అందునా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పంచాయితీరాజ్ సహా పలు శాఖలకు సంబంధించి వున్న వేల కోట్ల అప్పుల్ని చూశాక.. జీతం తీసుకోవాలని అనిపించలేదన్నారు డిప్యూటీ సీఎం.
Pawan Kalyan Rejects Salary.. నా ఫర్నిచర్ నేనే కొనుక్కుంటా..
క్యాంప్ ఆఫీస్‌లో ఫర్నిచర్ కోసం అధికారులు తనను అడిగారనీ, ఫర్నిచర్ తానే కొనుక్కుంటానని వారికి చెప్పానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు జరిగింది. ఉదయాన్నే ప్రజా ప్రతినిథులు, అధికారులు.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడం గమనార్హం.
తొలిసారి డిప్యూటీ సీఎం పిఠాపురంలో పర్యటన..
మరోపక్క, ఎమ్మెల్యేగా ఎన్నికై, డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి పిఠాపురం నియోజకవర్గానికవ చ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారాయన.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తన గౌరవ వేతనం గురించి చెప్పారు. క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్ ప్రస్తావన తీసుకొచ్చారు.
అవినీతికి తావు లేని విధంగా పనిచేస్తానన్న డిప్యూటీ సీఎం, తప్పు జరిగితే ప్రజలు తనను నేరుగా ప్రశ్నించవచ్చని అన్నారు.