Pawan Kalyan Remuneration Kota పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత.? ‘ఓజీ’ సినిమా కోసం దాదాపు వంద కోట్లనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరో లేదా ఏ హీరోయిన్ అయినా.. అంతే కాదు దర్శకులు, ఇతర ప్రముఖ టెక్నీషియన్లు అయినా తన రెమ్యునరేషన్ గురించి బహిరంగంగా ప్రకటన చేశారా.?
పవన్ కళ్యాణ్ మాత్రం, ‘బ్రో’ సినిమా కోసం రోజుకి రెండు కోట్ల రూపాయల చొప్పున, మొత్తం 25 రోజుల కాల్షీట్స్‌కి మొత్తంగా 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రకటించేశారు.
Pawan Kalyan Remuneration Kota.. సీనియర్ నటుడు ‘కోట’కి ఎందుకు అభ్యంతరం.?
స్వర్గీయ ఎన్టీయార్‌గానీ, స్వర్గీయ ఏయన్నార్‌గానీ ఎప్పుడూ తమ రెమ్యునరేషన్ గురించి ప్రకటనలు చేయలేదన్నది సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఉవాచ.
‘ఈ మధ్యన కొందరు మైక్ పట్టుకుని, రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్నామని పబ్లిక్‌లో చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు..’ అంటూ కోట అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆడదాని వయసు, మగాడి జీతం గురించి అడగకూడదన్నది వెనకటికి పెద్దలు చెప్పేమాట.
ఇప్పుడలా కుదరదు కదా.! అన్నీ బహిరంగమే.! అంతా అందరికీ తెలిసోతున్న వ్యవహారాలే.
తీసుకున్న రెమ్యునరేషన్ గురించి చెబితే తప్పేంటి.?
రోజుకి రెండు కోట్ల రెమ్యునరేషన్.. అని పవన్ ప్రకటించడం చిన్న విషయం కాదు. తేడాలొస్తే ఆదాయపు పన్ను శాఖ గట్టిగానే పట్టుకుంటుంది.
అన్నీ తెలిసే, పవన్ కళ్యాణ్ ధైర్యంగా ప్రకటించారు తన రెమ్యునరేషన్ గురించి. ఈ విషయంలో ఆయన్ని అభినందించి తీరాల్సిందే.
ఇంతకీ, కోట ఎందుకు అంత అసహనంతో ఊగిపోయినట్లు.? ఆయనకి మనసులో ఏవో వున్నాయ్.! ‘మా’ ఎన్నికల సమయంలో కోట వర్సెస్ నాగబాబు వివాదం కావొచ్చు.. ఇంకోటి కారణం కావొచ్చు.!
Also Read: Adipurush Om Raut Telugu: ‘ఆదిపురుష్’కి ఎందుకీ తెగులు.?
వయసు మీద పడ్డాక సహజంగానే కొంత చాదస్తం పెరిగిపోతుంది. బహుశా కోట విషయంలోనూ అదే జరుగుతోందేమో.!
పెద్దాయన చేస్తున్న విపరీత వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే, ఎవరన్నా కోట శ్రీనివాసరావు వెనకాల వుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారా.? అన్నదే అసలు ప్రశ్న.
రాజకీయాల్లో వస్తున్న విమర్శల నేపథ్యంలో, ప్రజలకు జవాబుదారీగా వుండే క్రమంలో పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ వివరాలు వెల్లడించాల్సి వచ్చింది.
కోట శ్రీనివాసరావు కూడా గతంలో రాజకీయాల్లో వున్నారు. ఆయనకి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉద్దేశ్యం తెలియదని అనుకోలేం.!
కాకపోతే, తెరవెనుకాల ఏదో జరిగింది.! ఎవరో ఆయనతో ఇలా మాట్లాడిస్తున్నారు.! ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం ద్వారా తన పేరు ప్రఖ్యాతులే నాశనమవుతాయని ఆయన గుర్తెరిగితే మంచిది.