Pawan Kalyan Renu Desai.. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్.. ప్రేమించుకున్నారు, సహజీవనం చేశారు.. వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.
అనివార్య కారణాలతో పవన్, రేణు.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు విడాకులు తీసుకోవడం ద్వారా.
ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలో ఎవరూ విడాకులు తీసుకోనట్టు, పవన్ – రేణు విషయంలో జరిగిన, జరుగుతున్న యాగీ అంతా ఇంతా కాదు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లోకి రావడంతోనే ఈ యాగీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్.. విడాకులు తీసుకున్నా, వారిద్దరూ.. అకిరానందన్, ఆద్యలకు తల్లిదండ్రులే.

తాజాగా, అకిరానందన్ (Akira Nandan) స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంలో కుటుంబమంతా కలిసి ఫొటోకి పోజులిచ్చింది. ఓ ఫొటోను రేణుదేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Pawan Kalyan Renu Desai.. వాళ్ళకి ఆనందం.! వీళ్ళకేమో ఆక్రోశం.!
పవన్ కళ్యాణ్, అకిరానందన్ (Akiranandan), ఆద్య, రేణు దేశాయ్.. అంతా ఆహ్లాదంగా నవ్వుతుండడం కొందరికి అస్సలేమాత్రం మింగుడు పడ్డంలేదు.
‘పవన్ కళ్యాణ్ అభిమానులు గతంలో రేణు దేశాయ్‌ని తిట్టారు.. కాబట్టి, రేణు దేశాయ్‌కి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి..’ అంటూ పనికిమాలిన డిమాండ్లు తెరపైకి తెస్తున్నారు సోకాల్డ్ మేధావులు.

సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? అందులో వెకిలి వేషాలకు ఏ ప్రముఖుడైనా బాధ్యత వహిస్తాడా.? మతిలేని విశ్లేషణలు, పనికిమాలిన ఏడుపు ఎందుకు పవన్ కళ్యాణ్ మీద.? అంటే, అదంతే.!
పొద్దున్న లేస్తే, పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడమే పనిగా పెట్టుకుంటారు కొందరు. అలా ఏడ్చేవారిని పెంచి పోషిస్తుంటారు మరికొందరు. అదీ అసలు సమస్య.
Also Read: ఫ్లాప్ క్వీన్ కంగనా రనౌత్.! దారుణంగా పడిపోయిన ‘గ్రేడ్’.!
రేణు దేశాయ్ (Renu Desai) స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా, తమ కుటుంబం నవ్వుతూ వున్న ఫొటోని షేర్ చేశాక.. ఇందులో వివాదమేముంది.?
కోడి గుడ్డు మీద ఈకలు పీకడంలో సిద్ధహస్తులైనవారికే, ఇందులోనూ ‘కాంట్రవర్సీ’ కనిపిస్తుంది. ఎనీ డౌట్స్.?