Pawan Kalyan Sai Dharam Tej పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. సముద్రఖని దర్శకత్వంలో రూపొందనుంది ఈ సినిమా.
సాయిధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej) కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ‘వినోదియ సితం’ సినిమాకి ఇది తెలుగు రీమేక్.
అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
సినిమా కోసం పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారట. ఈ సమయంలోనే, మొత్తంగా పవన్ కళ్యాణ్ మీద సీన్స్ షూట్ చేసేస్తారట.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఈ చిత్రానికి రచనా సహకారం అందించడం మామూలే. సముద్రఖనికి తెలుగులో ఇదే దర్శకుడిగా తొలి సినిమా కావడం గమనార్హం.

ఇదిలా వుంటే, ‘ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాదు.. కేవలం సాయి ధరమ్ తేజ్ సినిమా మాత్రమే. ఇందులో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు..’ అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం షురూ చేశారు.
Pawan Kalyan Sai Dharam Tej.. పవన్ కళ్యాణ్ సినిమా కాకపోతే మరేంటి.?
పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ నేపథ్యంలో, ఆయన చేసే సినిమాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూటింగ్‌కి తక్కువ డేట్స్ కేటాయించేలా సినిమాల్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది.
ఈ క్రమంలోనే, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇలాంటి సినిమాల్ని ఎంచుకుంటున్నారనే వాదనా లేకపోలేదు.
సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి ఎంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఇది ముమ్మాటికీ పవన్ కళ్యాణ్ సినిమానే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
Also Read: తమన్నా తకధిమితోం.! ఫన్ లేదు, ఓన్లీ ఫ్రస్ట్రేషన్.!
సినిమాపై దుష్ప్రచారం నేపథ్యంలోనే, ‘ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాదు..’ అనే గాలి వార్తల్ని కొందరు ప్రచారంలోకి తెస్తున్నారన్నది నిర్వివాదాంశం.
ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ – క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ అక్టోబర్ లోపు పూర్తి చేసెయ్యాలని అనుకుంటున్నారట.