Pawan Kalyan Saidharam Tej.. మేనమామ పవన్ కళ్యాణ్.. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమానే ఈ రోజు లాంఛనంగా ప్రారంభమయ్యింది.
నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ‘వినోదియ సితం’ సినిమానే తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్.!
మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన మేనమామ పవన్ కళ్యాణ్‌ని ‘గురువు’గా భావిస్తుంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
Pawan Kalyan Saidharam Tej.. ఇది నిజంగానే సిత్రం.!
‘వినోదియ సితం’ అనేది ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తాడు. రియల్ లైఫ్‌లో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌ని ఎదుర్కొన్నాడు కదా.. అలాంటి యాక్సిడెంట్ సినిమాలోనూ వుంటుంది.
సో, ఇది నిజంగానే అభిమానులకి బాగా కానెక్ట్ అయిపోయే సబ్జెక్ట్.! సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా, సినిమాలో కీలక మార్పులు చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్.

సినిమా లాంఛనంగా నేడు ప్రారంభమయ్యింది. శరవేగంగా సినిమా నిర్మాణం పూర్తయిపోతుందట.
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) చాలా తక్కువ డేట్స్ ఇచ్చాడని చెబుతున్నారు. సైమల్టేనియస్‌గా పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాల్నీ పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే సుజీత్ దర్శకత్వంలో సినిమా లాంఛనంగా ప్రారంభమవగా, అంతకు ముందే లాంఛనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభమైంది.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
అన్నట్టు, ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ దశలో వుంది. ఈ ఏడాది మొత్తంగా మూడు సినిమాలు పవన్ కళ్యాణ్ నుంచి విడుదలవుతాయనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుంటే, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తోన్న ‘విరూపాక్ష’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇంతకీ, ‘వినోదియ సితం’ రీమేక్‌కి ఏం టైటిల్ పెడతారబ్బా.? ‘దేవర’ అని వచ్చేలా టైటిల్ పెడతారన్నది ప్రస్తుతం వినిపిస్తోన్న హాటెస్ట్ గాసిప్.!