Pawan Kalyan Sukha Jeevi.. సినీ నటుడు, జనసేన అధినేత సుఖ జీవి అట.! అంటే, ఏమాత్రం కష్టపడే అవసరం లేకుండా వుంటాడట.
అలాగని, ఓ సెక్షన్ మీడియా తెగ బాధపడిపోతోంది. పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తోంది.!
తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్‌డమ్ ఆయన సొంతం. సుఖ జీవిగా వుండాలనుకుంటే, ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన పనిలేదు. నిజానికి, ఎక్కువగా సినిమాలూ చేసెయ్యాల్సిన పనిలేదు.
సుఖ జీవిగా వుండాలని పవన్ కళ్యాణ్ ఏనాడూ కోరుకోలేదు. తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ కోసం, గుండెల మీద బండ రాళ్ళు పగలగొట్టించుకున్నాడాయన.
సుఖ జీవిలా వుండాలనుకుంటే.. కోట్లు దోచుకుని, దాచుకుంటాడుగానీ.. కష్టపడి సంపాదించిన సొమ్ముని జనానికి పంచిపెడతాడా.? కష్టంలో వున్నోడ్ని అప్పులు చేసి మరీ ఆదుకుంటాడా.? కన్న బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా సాయం చేయడానికి ముందుకొస్తాడా.?
Mudra369
అంతేనా, కార్ల చక్రాల్ని తన చేతుల మీద ఎక్కించుకున్నాడు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు.. ఈ క్రమంలో చాలాసార్లు గాయపడ్డాడు కూడా. ఇవన్నీ సుఖ జీవి లక్షణాలని ఎవడైనా అనగలడా.?
సుఖ వ్యాధి లక్షణమిదీ..
అంటాడు.. ఒక్క ‘సుఖ వ్యాధి’తో బాధపడుతున్నవాడు మాత్రమే అలా అనగలడు. పవన్ కళ్యాణ్‌ని చూసి ‘సుఖ జీవి’ అంటూ కుళ్ళుకుంటాడు.
మీడియాలో ఈ మధ్య ‘సుఖ వ్యాధి’తో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువైపోయింది.
సుఖ వ్యాధి.. అంటే, అది శారీరక అనారోగ్యం అనుకునేరు.? ఇది, మానసిక అనారోగ్యం. నిజానికి, ఇది మానసిక వైకల్యం.! మెగా కాంపౌండ్ అంటే ఏడవడమే ఈ కొత్త ‘సుఖ వ్యాధిగ్రస్తుల’ అనారోగ్య సమస్య.
దీన్ని కడుపు మంట అని కూడా అనొచ్చు. లేదా, ఇంకేమైనా పేరు పెట్టి పిలవొచ్చు. అలాంటి పేర్లను కనిపెట్టడం కూడా కష్టమే.

రాజకీయాల్లోకి రావడమంటేనే కష్టం.! తండ్రులు సంపాదించి పెట్టిన వందల కోట్లు, వేల కోట్లు లక్షల కోట్లను.. ఇంకా ఇంకా పెంచేందుకోసం రాజకీయాలు చేసే వాళ్ళు వేసే ఎంగిలిమెతుకులకు అలవాటుపడిపోతారీ సుఖ వ్యాధిగ్రస్తులు.
Pawan Kalyan Sukha Jeevi.. ఏవీ నైతిక విలువలు.?
మీడియా అంటే నైతిక విలువలు. సుఖ వ్యాధిగ్రస్తులు మీడియాలోకి వస్తే, మీడియాలో విలువలేముంటాయ్.? ఎవడ్ని వెనకేసుకొస్తున్నాం.? అన్న ఆత్మ విమర్శ అసలే వుండదు. విమర్శించే క్రమంలో ఇంగితమూ వుండదు.
Also Read: తొక్కినేని ‘మెంటల్’ రచ్చ: నాగచైతన్యకి బాలయ్య మాస్ వార్నింగ్.!
సినిమాల్లో లగ్జరియస్ లైఫ్ వదిలేసుకుని, ప్రజా సేవ కోసం జనంలోకి వచ్చి కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ ఎలా సుఖ జీవి అవుతాడు.? కడుపుకి అన్నమే తింటే.. ఇలాంటి రాతలు అస్సలు రావు.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు సుఖ జీవిలా వుండాలనుకుంటే.. అసలు సినిమాలెందుకు.? రాజకీయాలెందుకు.? పవన్ కళ్యాణ్‌ని సుఖ జీవి అనాలంటే, కాస్తంతైనా ఇంగితం వుండాలి కదా.?