Pawan Kalyan Surender Reddy.. ఓ వైపు రాజకీయాలు.. ఇంకో వైపు సినిమాలు.! నిజానికి, రెండు పడవల మీద ప్రయాణం కష్టమే.! ఒకింత ఇబ్బందికరం కూడా.!
రాజకీయాలకీ.. సినిమాలకీ.. రెండిటికీ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) న్యాయం చేయలేకపోతున్నారన్న చర్చ ఇటు సినీ వర్గాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ జరగుుతోంది.
ఎవరేమనుకున్నా, పవన్ కళ్యాణ్ అటు సినిమాలు చేయాలనీ.. ఇటు రాజకీయాల్లోనూ కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.. కొందరు సినీ ప్రముఖులూ ఇదే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
Pawan Kalyan Surender Reddy.. కొత్త సినిమా షురూ..
పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో రామ్ తాల్లూరి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది.
వాస్తవానికి.. చాన్నాళ్ళ క్రితం అనుకున్న ప్రాజెక్టే ఇది.! పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి గ్రీన్ సిగ్నల్ రావడానికి కొంత సమయం పట్టింది అంతే.

రామ్ తాళ్ళూరి (Ram Talluri) అంటే, పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడు. రాజకీయాల్లోనూ, జనసేన పార్టీ (Jana Sena Party) తరఫున కీలకంగా పనిచేస్తున్నారాయన.
వాటి సంగతేంటి మరి.?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి ‘హరి హర వీరమల్లు’ కాగా, ఇంకోటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మరొకటి ‘ఓజీ’.
ఈ మూడిటిలో ‘ఓజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘హరి హర వీరమల్లు’ సినిమాకి బ్రేక్ వచ్చింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదలై.. కాస్త ఆగింది.
Also Read: నా సామిరంగ.! ‘కింగ్’ నాగ్ అంటే ఇట్లుండాలె.!
బ్యాక్ టు బ్యాక్ ‘ఓజీ’ అలాగే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలకి పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అవి త్వరగా పూర్తి చేయాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన అట.
మరి, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకి పవన్ కళ్యాణ్ ఎలా డేట్లు కేటాయిస్తారు.? ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ పెరుగుతోందాయె.! ఏమో, పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో.!