పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే పవర్ ఫుల్ అండ్ స్టయిలిష్ లుక్ అందరికీ గుర్తుకొస్తుంది. అయితే, అదంతా సినిమా వరకు మాత్రమే. రియల్ లైఫ్‌లో ఆయన చాలా సింపుల్‌గా (Pawan Kalyan Swadeshi Mantra) వుండేందుకు ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేసేవారికి మాత్రమే బాగా తెలిసిన విషయమిది. పంచె కట్టుని ఆయన ఇష్టపడతారు.
సాదా సీదా వస్త్రధారణ వైపు మొగ్గు చూపుతారు మామూలు రోజుల్లో. రాజకీయాల్లోకి వచ్చాక పంచె కట్టుతోనే ఎక్కువగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారుగానీ, ఆ గెటప్ ఆయనకి అలవాటైనదే.. ఆయన్ని దగ్గరనుంచి చూసేవాళ్ళకీ అలవాటైన వ్యవహారమే.
తాజాగా పవన్ కళ్యాణ్ ‘స్వదేశీ మంత్ర’ నినాదాన్ని విన్పించడం రాజకీయ వర్గాల్లో చాలామందికి ఆశ్చర్యంగానే అన్పించింది. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ముందుకు తెచ్చిన నినాదాన్ని, ఇకపై జనంలోకి బీజేపీ – జనసేన సంయుక్తంగా తీసుకెళతాయని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం విదితమే.
రాజకీయంగా బీజేపీ – జనసేన ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్ళనున్నాయి. అయితే, పవన్ కళ్యాణ్, స్వదేశీ ప్రమోషన్ ఈనాటిది కాదు. గతంలో ఆయన, చేనేతకు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని చెప్పారు. చెప్పడమే కాదు, చేనేత దుస్తుల్ని ధరిస్తానని హామీ ఇచ్చారు.. ఇచ్చిన మాటకు కట్టుబడి అవే దుస్తుల్ని ధరిస్తున్నారు కూడా.
కొందరికి పవన్ కళ్యాణ్ వ్యవహరించే తీరు పట్ల ఆక్షేపణలు వుండొచ్చుగాక. రాజకీయ కోణంలో ఆయన్ని విమర్శించేవారు ఎప్పుడూ వుండొచ్చుగాక. కానీ, ఆయన తన స్టార్‌డవ్‌ుకి దూరంగా వుండడాన్నే ఇష్టపడతారు. ఈ క్రమంలో ఆయన ప్రదర్శించే అతి సాధారణ జీవితం.. కొందరికి వెటకారంగా అన్పిస్తే.. అది ఆయన తప్పు కానే కాదు.
స్వదేశీ మంత్ర.. (Pawan Kalyan Swadeshi Mantra) మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. దేశాన్ని మరింత ముందుకు నడిపించడానికి. ఈ విషయంలోనూ పవన్ కళ్యాణ్‌ని విమర్శించాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు.
సినిమా వేరు, రాజకీయాలు వేరు.. రియల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్‌లో ఎలా వుంటారన్నదానిపైనే.. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వం ఆధారపడి వుంటుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌కి వంక పెట్టడమంటే, అది పనిగట్టుకుని చేసే దుష్ప్రచారం తప్ప ఇంకోటి కానే కాదు.