Pawan Kalyan Uddaanam.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్.. ఇలా రకరకాల వెటకారాల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలానే చేస్తున్నారు.
తనపై వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఎటాక్‌గా, ‘చంచల్ గూడా జైలు పుత్రుడు.. సీబీఐ దత్త పుత్రుడు..’ అని పవన్ కళ్యాణ్ కూడా ఎదురుదాడికి దిగుతున్నారు.! చెత్త పుత్రుడనీ, ఉత్తపుత్రుడనీ.. బోల్డన్ని విమర్శలు.! అది వేరే సంగతి.
ఓ రాజకీయ నాయకుడు, రాజకీయ వేదికలపై చేసే విమర్శల్ని ఓ కోణంలో చూడాలి.! అవే విమర్శల్ని ఏ రాజకీయ నాయకుడైనా, అధికారిక వేదికలపై చేస్తే, వాటిని మరో కోణంలో చూడాల్సి వస్తుంది.!
Pawan Kalyan Uddaanam.. మ్యారేజ్ స్టార్ అంటే ఏంటి.?
పవన్ కళ్యాణ్‌కి మూడు పెళ్ళిళ్ళు జరిగాయి. ‘నా జీవితంలో కుదరలేదు. అందుకే, అలా జరిగింది.’అంటూ పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు కూడా.!
పెళ్ళి అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం. అది తెలియనంత అమాయకత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో వుందని అనుకోగలమా.?
కేవలం పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) పెళ్ళి వల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆగిపోయిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పదలచుకుంటున్నారా.?
ప్రజా ధనాన్ని వేతనంగా పొందుతున్న ‘ప్రజా సేవకుడు’ అయిన ముఖ్యమంత్రి, ఆ ప్రజాధనం వెచ్చించి నిర్వహించే బహిరంగ సభల్లో ప్రజలకు పనికొచ్చే మాటలే మాట్లాడాలి.!
వ్యక్తిగత విమర్శలేమన్నా వుంటే, పార్టీ వేదికలపై చేసుకోవచ్చు.! లేదూ, ఇదే పద్ధతి ఏ ముఖ్యమంత్రి కొనసాగించినా.. అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. తమను గద్దెనెక్కించిన ప్రజల్ని వంచించడమే అవుతుంది.!
Mudra369
ఆ పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ వల్ల పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ఆగిపోయిందనేంత అమాయకత్వంలో వైఎస్ జగన్ వున్నారా.?
అసలు మ్యారేజ్ స్టార్ అంటే ఏంటి.? మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మ్యారేజ్ స్టార్ అంటారని.. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ (Ys Jagan Mohan Reddy) ఏదన్నా చట్టం తీసుకొచ్చారేమో.!
ఇదే విమర్శ వైఎస్ జగన్, ఏదన్నా రాజకీయ వేదిక మీద చేస్తే, అది రాజకీయం.. ఆయన్ని తప్పు పట్టడానికేమీ లేదు. రాజకీయాలన్నాక విమర్శలు సహజం.
కిడ్నీ బాధితుల ఆవేదన.. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు..
ఉద్దానం కిడ్నీ సమస్య గురించి ప్రపంచం కన్నెత్తి చూసిందంటే, అది పవన్ కళ్యాణ్ వల్లనే. అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల్ని పవన్ కళ్యాణ్, ఉద్దానం ప్రాంతానికి రప్పించారు.
Also Read: Mrunal Yashna Thakur.! పదండి.! ప్రేమలో పడిపోండి.!
చరిత్ర ఎప్పటికీ ఈ విషయాన్ని మర్చిపోలేదు.! ఉద్దానం ప్రాంతం కూడా.! నో డౌట్, వైఎస్ జగన్ హయాంలో నిర్మితమైన ఆసుపత్రి, నీటి ప్రాజెక్టు.. ఉద్దానానికి ఎంతో మేలు చేస్తాయ్.!
కానీ, కిడ్నీ వ్యాధి పీడితుల దగ్గరకు వెళ్ళి, అక్కడ జరిగిన అధికారిక బహిరంగ సభలో, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావన తెచ్చి, మ్యారేజ్ స్టార్.. అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడమంటే, అంతకన్నా దిగజారుడుతనం ఇంకోటుండదు.!