Pawan Kalyan Unstoppable.. నందమూరి బాలకృష్ణతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు కలిపారు. ఇద్దరూ సరదాగా ముచ్చట్లు చెప్పుకున్నారు.! ఇరువురి అభిమానుల్నీ అలరించారు.!
ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడం వెనుక ఓ ఎపిసోడ్‌లో ప్రభాస్ చీఫ్ గెస్ట్ ఓ కారణమైతే, అసలు సిసలు ‘పవర్’ పవన్ కళ్యాణ్ అద్దడం ఇంకో కారణం అనాలేమో.!
ఆహా అన్‌స్టాపబుల్ హిస్టరీలోనే, ఓ స్పెషల్ గెస్ట్ ఎంట్రీకి వేలాది మంది అభిమానులు పోటెత్తడం ఇదే తొలిసారి.!
పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, ప్యాకేజీ ఆరోపణలు.. వీటన్నటికీ ‘అన్‌స్టాపబుల్’ సమాధానాలు జనసేన అధినేత ఇచ్చే వుంటారు.!
Mudra369
సినిమా రంగంలో పోటీ, రాజకీయ రంగంలోనూ పోటీ.. ఇంకోపక్క ‘కులాల కుంపట్లు’ (వీళ్ళకి సంబంధం లేకపోయినా).. వెరసి, పవన్ – బాలయ్య ఒకే వేదికపై కన్పించడమంటే అదో పెద్ద సంచలనం.
బాలయ్య కొలతలు..
ఆరడుగుల బుల్లెట్టు.. అంటూ ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని పాట అందరికీ గుర్తుండే వుంటుంది. బహుశా అందుకేనేమో, బాలయ్య నోట ‘మెజర్మెంట్’ అనే మాట వచ్చింది.
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. ఓ వేదికపై కలవడమో ఓ సంచలనం అనుకుంటే, ఇద్దరూ చేతులు కలిపి.. రాజకీయ నాయకుల్లా కలిసిన చేతుల్ని పైకెత్తి అభిమానులకు చూపించారు ‘ఆహా’ వేది ద్వారా.!
Pawan Kalyan Unstoppable ఆ నవ్వు వరం సామీ..
పవన్ కళ్యాణ్ నవ్వులో స్వచ్ఛత గురించి కొత్తగా చెప్పేదేముంది.? మనస్ఫూర్తిగా నవ్వుతారాయన. బాలకృష్ణ ఎలాంటి జోకులు పేల్చారోగానీ.. పగలబడి నవ్వేశారు పవన్ కళ్యాణ్.
Also Read: గోల్డెన్ గ్లోబ్: ‘నాటు’గా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కొనేసిందా.?
ఇంతకీ, ఈ టాక్ షోలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయి.! సినీ, రాజకీయ అంశాలపై పవన్ – బాలయ్య మధ్య ఎలాంటి డిస్కషన్ నడిచింది.?

పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, ప్యాకేజీ ఆరోపణలు.. వీటన్నటికీ ‘అన్‌స్టాపబుల్’ సమాధానాలు జనసేన అధినేత ఇచ్చే వుంటారు.! అవేంటన్నది ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయితేనే తెలుస్తుంది.
సంక్రాంతి సందర్భంగా రివీల్ చేసిన ఇంట్రో టీజర్.. సంచలనాలకు కేంద్ర బిందువయ్యింది. మరి ట్రెయిలర్ సంగతేంటి.? కంప్లీట్ ఎపిసోడ్ ఇంకెలా వుండబతోంది.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!