Pawan Kalyan Vana Mahotsavam.. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చారు.!
ఊరూ వాడా వన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్.! దీన్ని ప‘వన’మహోత్సవం.. అని పిలుచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.
చెట్టు లేకపోతే మనిషి బతికేదెలా.? ఇది అందరికీ తెలుసు.! కానీ, చెట్లని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటాం.
Mudra369
నిజంగానే, ఇది ప‘వన’మహోత్సవం.! పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా లక్షలాది.. కాదు కాదు, కోట్లాది మొక్కలు నాటబోతున్నారు అభిమానులు.
Pawan Kalyan Vana Mahotsavam.. ఇది మన ఉత్సవం.!
మొక్కలు నాటడం.. అంటే, మనకి మనం సేవ చేసుకుంటున్నట్లు.! చాలా ఏళ్ళుగా చెట్ల పెంపకం గురించీ, వాటి ఆవశ్యకత గురించీ వింటూనే వున్నాం. అప్పుడప్పుడూ మనమూ లెక్చర్లు దంచేస్తుంటాం.
అయినా, చెట్టు లేకపోతే మనిషికి మనుగడెక్కడిది.? చెట్ల నుంచి ఆక్సిజన్ లభిస్తుంది.. అందుకే, వాటిని పెంచాలి. మనం బతకాలంటే, చెట్లు బతకాలి.!

చెట్ల నుంచి కలప లభిస్తుందనీ, చెట్లు నీడనిస్తాయనీ.. ఇలా చిన్నప్పుడే చదువుకున్నాం. కానీ, మొక్కలు పెంచడం, వాటిని మహా వృక్షాలుగా మలచడంలో మనకి అంత శ్రద్ధ వుండటం లేదు.
Also Read: సింగిల్ సింహం.! ఎంత నిజం.?
ప్రపంచం కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో, మొక్కలు నాటడం.. అవి చెట్లయ్యేవరకూ వాటిని సంరక్షించడం ఓ సవాల్.
ఒక్క చెట్టు నరికితే, వెయ్యి మొక్కలు నాటడం ద్వారా మాత్రమే కొంతమేరకు నష్టాన్ని పూడ్చగలం. అందుకే, వన మహోత్సవం.. అంటే, అది మన ఉత్సవంగా మారాలి.

ఇదేదో ప్రచార కార్యక్రమంలా కాకుండా.. మన కోసం, మనం చేసుకుంటున్న ఉత్సవంలా వుండాలి.. ఓ పండుగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కి థ్యాంక్స్ చెప్పడంతోపాటు, పుట్టిన రోజు శుభాకాంక్షల్నీ అందిద్దాం.!
Happy Birthday Andhra Pradesh Deputy Chief Minister Konidala Pawan Kalyan.