Pawan Kalyan Varahi.. వచ్చేసింది ‘వారాహి’ జనంలోకి.! ఔను, రోడ్డుపై ‘వారాహి’ వెళుతోంటే, ఓ మిలిటరీ శకటం వెళుతున్నట్లే అనిపించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ‘వారాహి’ వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిగాయి.
ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారంలో వున్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రమాదానికి గురయ్యారు. అప్పట్లో ఆ ప్రమాదం నుంచి తాను క్షేమంగా బయటపడటం కొండగట్టు ఆంజనేయ స్వామి దీవెనలేనని పవన్ భావిస్తారు.
Pawan Kalyan Varahi.. ప్రత్యేక పూజల అనంతరం జనంలోకి..
ప్రత్యేక పూజలు ‘వారాహి’ (Janasena Varahi) వాహనానికి నిర్వహించిన అనంతరం జనసేన అధినేత, ఆ వాహనం నుంచే జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
మరోపక్క, జనసేన తెలంగాణ నేతలతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణలోనూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని జనసేన అధినేత ప్రకటించారు.
తెలంగాణలోనూ పోటీ..
తెలంగాణలో మొత్తం 7 నుంచి 14 లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు జనసేనాని. పొత్తులకు సమయం వుందనీ, ఎవరితో పొత్తులనేవి ముందు ముందు చెబుతామని అన్నారాయన.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. కొత్త పొత్తులు కుదిరితే కుదరొచ్చనీ.. ఒంటరిగా పోటీ చేసే అవకాశమూ లేకపోలేదనీ పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) ని స్వాగతిస్తున్నట్లు చెప్పిన జనసేనాని, బీజేపీతో (Bharatiya Janata Party) ప్రస్తుతం పొత్తులో వున్నట్లు పేర్కొన్నారు.
Also Read: అయ్యయ్యో ఆర్జీవీ.! ఎలాంటోడివి.. ఇలా దిగజారిపోయావ్.!
ఆంధ్రప్రదేశ్‌లో బాబాయ్‌ని చంపిన వ్యక్తులతో రాజకీయ యుద్ధం చేస్తున్నట్లు జనసేనాని (Janasenani Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) వారాహి (Janasena Varahi) వాహనాన్ని అడ్డుకుంటామని కొందరు అంటున్నారనీ, ఎవరి బెదిరింపులకూ తలొగ్గేది లేదని జనసేనాని చెప్పారు.
‘మనల్ని ఎవడ్రా ఆపేది..’ అంటూ జనసైనికులు, సోషల్ మీడియా వేదికగా.. నినదిస్తున్నారు.