Pawankalyan at Warangal NIT.. ఓడిపోవడం నేరమా.? ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎక్కడో ఓ చోట ఓడిపోతుంటారు.! కొన్నిసార్లు అలా ఓడిపోవడమే గౌరవం కూడా.!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘ఓటమి’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నిన్న ఓడిపోవచ్చు, కానీ రేపు గెలుస్తాను’ అని చెప్పుకొచ్చారాయన.
ఇదేదో, ఊకదంపుడు రాజకీయ ప్రసంగం కాదు. భావితరానికి ఇచ్చిన అత్యద్భుతమైన సందేశం. భవిష్యత్ భారతాన్ని నిర్మించే యువతకు ఆయన ఈ సందేశాన్నిచ్చారు.
Pawankalyan at Warangal NIT.. వరంగల్ నిట్‌లో పవన్ అత్యద్భుతమైన స్పీచ్..
వరంగల్ నిట్ కల్చరల్ ఫెస్ట్‌కి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘నేను రెగ్యులర్ స్టూడెంట్‌ని కాదు. యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోలేదు..’ అని చెప్పారు పవన్ కళ్యాణ్.
‘కానీ, నేను నిత్య విద్యార్థిని..’ అని చెప్పిన పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), ‘దేహ దారుఢ్యంతోపాటు, గుండె ధైర్యం పెంచుకో’ అని యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘ప్రపంచం నీది, భవిష్యత్తు నీది.. దేశ పురోగతికి నీ వంతు కృషి చేయాలని ‘అన్నారు పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan).
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
‘ప్రసంగించడానికి రాలేదు, నా అనుభవాల్ని పంచుకోవాలని వచ్చాను.. ఇక్కడికి వచ్చే ముందు నాకూ కొన్ని అనుమానాలున్నాయి..’ అంటూ చెప్పుకొచ్చారు జనసేనాని.

అభిప్రాయం చెప్పాలన్నా సమాజంలో భయపడాల్సిన పరిస్థితులు వున్నాయన్న జనసేనాని (Jana Sena Party Chief Pawan Kalyan), ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడి వచ్చానని అన్నారు.
ఆద్యంతం పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ప్రసంగం, యువతలో నూతన ఉత్తేజాన్ని పెంచేలా వుంది. వరంగల్ ‘నిట్’లో స్ప్రింగ్ స్ప్రీ 2023లో జనసేన అధినేత ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నంతసేపూ ఆ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. అదే సమయంలో ఆయన ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులు అత్యంత శ్రద్ధగా వాటిని విన్నారు.