Politcal Decoit: రాజకీయాల్లో మంచోడ్ని చెడ్డోడిగా, చెడ్డోడ్ని మంచోడిగా చూపించేందుకు ప్రయత్నం జరుగుతుంటుంది.
అసలు రాజకీయమంటేనే అబద్ధం. అబద్ధాలు చెప్పాలి, మోసాలు చెయ్యాలి.. అలా చేస్తేనే రాజకీయం సరిగ్గా చేస్తున్నట్టు.
ఎవరైతే అబద్ధాలు చెప్పగలరో, ఎవరైతే మోసాలు బాగా చెయ్యగలరో అలాంటివాళ్ళే రాజకీయాల్లో రాణిస్తారని నయా రాజకీయ సిద్ధాంతం చెబుతోంది. ఎందుకంటే, ఆ సిద్ధాంతాన్ని రచించి పారేస్తున్నది నేరగాళ్ళే మరి.!
జైలుకు వెళ్ళి వస్తేనే పదవులన్నట్టు తయారైంది పరిస్థితి. వివిధ రంగాల్లో రాణించి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేస్తామంటే కుదరదిక్కడ.
అలా పద్ధతిగా సేవ కోసం రాజకీయాల్లోకి వస్తే, వాళ్ళ మీద ‘గజ దొంగలు’ అన్న ముద్ర పడిపోతుంటుంది.
Politcal Decoit.. ఆ గజదొంగ ఎవరు.?
ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే.. అని తెలంగాణలో ఓ సామెత లాంటిదొకటి చెబుతుంటారు. అలా తయారైంది వ్యవహారం రాజకీయాల్లో.
దొంగే.. ‘దొంగా దొంగా..’ అని అరుస్తున్నాడిక్కడ. పైగా, గజదొంగలుగా ఇతరుల్ని చూపే ప్రయత్నం చేస్తున్నాడు.
ఒక అబద్ధం పదే పదే చెబితే నిజమనే భ్రమల్లో ఆ గజ దొంగలు వున్నారన్నది సదరు మహానుభావుడి ఉవాచ.
జనాల ఖర్మ కాకపోతే.. అడ్డంగా దోచేశాడన్న కారణంగా.. ఆయనగార్ని జైల్లో పడేస్తే.. ‘ఒక్క ఛాన్స్’ అంటూ అధికారంలోకి వచ్చి, ఇతరుల్ని గజ దొంగ అంటున్నాడు. ఇదండీ నేటి రాజకీయం.
Also Read: సాములోరి రాజకీయం.! ఏం ఖర్మ పట్టింది బాసూ.!
ఇంతకీ ఆ గజదొంగ ఎవరు.? ఆ ఒక్కటీ అడక్కూడదు. ఎందుకంటే ఇది చాలా చాలా చిక్కు ప్రశ్న.
కూతురికి పెళ్ళి సంబంధం వెతకడానికి సవాక్ష ఆలోచిస్తాం. కొత్త బైక్ కొనుక్కోవాలన్నా చాలా చాలా ఆలోచిస్తాం.
కానీ, మన నెత్తినెక్కి మన జీవితాల్ని చెలగాటమాడతాడేమోనని కాస్త కూడా ఆలోచించకుండానే ‘గజదొంగ’కి అధికారమిస్తాం.!
ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్.. డాష్ డాష్.!