Politics Bodi Salaha.. ‘ఉచిత సలహా’ అనే మాట తరచూ వింటాం. కానీ, ఇది అత్యంత ఖరీదైన సలహా.! ఔను మరి, ఏదీ ఊరికినే లభించదు దేశంలో. ప్రతి సలహాకీ బోల్డంత ఖర్చవుతుంది.
అదేంటీ, రాజకీయాలంటే సేవ కదా.? అలాంటప్పుడు, అధికారంలో వున్నవారు ‘సలహా’ పేరుతో దోచేసుకోవడమేంటి.? అదే మ్యాజిక్ అంటే.!
ఆ శాఖకి సలహాదారుడు, ఈ శాఖకి సలహాదారుడు.! చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో దానికీ, దీనికీ.. అన్నటికీ సలహాదారులే.!
వందల కోట్ల ప్రజా ధనం వృధా.!
ప్రభుత్వమంటే అదో పెద్ద వ్యవస్థ.! సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ఆయా రంగాల్లో నిష్ణాతులు.. వీళ్ళందరికీ పెద్ద మొత్తంలో జీతాలు ఇస్తుంటుంది ప్రభుత్వం.
అంత అనుభవం వున్న అధికారుల్ని కాదని, సలహాదారులు పీకేదేముంటుంది.? ఎన్నికల్లో గెలవడానికి ‘సలహా’ కావాలి, గెలిచాక పాలన కోసం సలహా కావాలి.!
రాను రాను ‘సలహాదారు వ్యవస్థ’ అంటే, ‘రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రం’గా తయారవుతోంది.
Politics Bodi Salaha.. బాధ్యత వుండక్కర్లా.?
ఇక్కడ ఎవరికీ బాధ్యత లేదు.! సలహాదారులకేమో, లక్షలాది రూపాయల వేతనాలు.. వాటికి తోడు లక్షలు వెచ్చించి సౌకర్యాలు.!
పదుల సంఖ్యలో సలహాదారులు దేనికి సంకేతం.? ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అన్న తేడాల్లేవు.. అంతటా సలహా పేరుతో జరుగుతున్నది దోపిడీనే.!
వందల కోట్లు.. వేల కోట్లు సలహాదారులకీ, పబ్లిసిటీ స్టంట్లకీ ఖర్చు చేస్తూ పోతేంటే, బాధ్యతాయుతమైన పాలన.. అదెలా సాధ్యం.?
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
ప్రభుత్వమంటే జవాబుదారీతనం.. కానీ, దురదృష్టవశాత్తూ అదే వుండటంలేదిప్పుడు.! పరిపాలన అంటే బరితెగింపులా మారిపోయిన రోజులివి.! దోచుకున్నోడికి దోచుకున్నంత.!
చివరగా.! కనీసార్హత లేనోళ్ళు ఇచ్చే బోడి సలహాల వల్ల ప్రభుత్వాలకి న్యాయస్థానాల్లో చిక్కులెదురైతే, వాటిని పరిష్కరించడం కోసం మళ్ళీ సలహాదారుల అవసరం.!
నవ్విపోదురుగాక.. వీళ్ళకేటి సిగ్గు.? అయినా, వృధా అవుతున్నది ప్రజాధనమే కదా.? అధికారంలో వున్నోళ్ళ జేబుల్లోంచి ఖర్చయితే.. ఆ కష్టమేంటో తెలుస్తుంది.!
అధికారంలోకి వచ్చేందుకు జేబుల్లో సొమ్ముల్ని ఖర్చు చేస్తారేమోగానీ, అధికారంలోకి వచ్చాక ఎందుకు సొంత సొమ్ములెలా ఖర్చు చేస్తారు.?
అప్పటిదాకా ఖర్చు చేసింది.. దానికి రెండింతలు.. పదింతలు తిరిగి రాబట్టడంలోనే బిజీ అయిపోతారు మరి.!