Pooja Hegde Golden Leg.. మళ్ళీ మొదలైంది ‘లెగ్గు’ దుమారం. సైన్మా అంటేనే సెంటిమెంటు.. సెంటిమెంటు అంటేనే సైన్మా అన్నట్టు.. అంటుంటారు చాలామంది సినీ పరిశ్రమలో.
ఓ సినిమా హిట్టయితే, ఆ సినిమాలో నటించిన అందాల భామది గోల్డెన్ లెగ్గు.! అదే సినిమా ఫ్లాపయితే, ఐరన్ లెగ్గు.!
హీరోయిన్లకే కాదు, చాలామంది నటీనటులు, టెక్నీషియన్లకు ఈ ‘సెంటిమెంటు’ సమస్య ఎదురవుతుంటుంది.
మ్యూజిక్ డైరెక్టర్ హేరిస్ జేరాజ్‌కి తెలుగులో వున్న బ్యాడ్ సెంటిమెంట్ అంతా ఇంతా కాదు.
ప్రముఖ బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి.. తెలుగులో ఐరన్ లెగ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. చెప్పుకుంటూ పోతే, ఇదో పేద్ధ కథ.!
పూజా హెగ్దే కాళ్ళకున్న క్రేజ్ అలాంటిది.!
అసలు విషయానికొచ్చేద్దాం.! ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది పూజా హెగ్దే లెగ్గు గురించి.

‘నీ కాళ్ళను పట్టుకు వదలనన్నది..’ అంటూ అల్లు అర్జున్ ‘అల వైకుంటపురములో..’ (Ala Vaikuntapuramulo) సినిమా కోసం మాంఛి సాంగేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ కాళ్ళ మీదనే చాలామంది దర్శకులు చాలా చాలా ఫోకస్ పెట్టేశారు.. హిట్లు కూడా కొట్టేశారు. అలాంటి గోల్డెన్ లెగ్ పూజా హెగ్దే, వున్నపళంగా ఐరన్ లెగ్ అయిపోయింది.
అంతా ‘బీస్ట్’, ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమాల ఫెయిల్యూర్స్ తాలూకు ఎఫెక్ట్.!
Pooja Hegde Golden Leg మారిపోయిందా.?
ఇప్పుడు ‘ఎఫ్3’ సినిమా వచ్చేస్తోంది. ఇందులో పూజా హెగ్దే ఓ స్పెషల్ సాంగ్ చేసింది. సినిమా విడుదలకు దగ్గర పడిన దరిమిలా, ఆ ఐటమ్ సాంగ్ తీసెయ్యాలనే డిమాండ్లు కొందరు ఔత్సాహిక నెటిజన్ల నుంచి వస్తున్నాయ్.
ఇదేం వేలం వెర్రి.? అంటే, అదంతే.! అలాగే వుంటుందిక్కడ.!
కానీ, కోట్లు ఖర్చు చేసి పూజా హెగ్దేతో ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు ‘ఎఫ్3’ (F3 Movie) మేకర్స్. అన్నట్టు, దర్శకుడు అనిల్ రావిపూడికి ఇప్పటిదాకా ఫ్లాపు అంటూ రాలేదు.
Also Read: Kangana Ranaut.. వామ్మో.! ఏం తెలివి.? క్లీన్ బౌల్డ్ చేసేస్తోందే.?
కొరటాల శివ కూడా ‘ఆచార్య’ సినిమాకి ముందే వరుస హిట్స్‌తో వున్నాడు మరి.! అతనికి షాక్ తగల్లేదా.? ఏమో, పూజా హెగ్గే లెగ్గు మళ్ళీ గోల్డెన్ లెగ్ అయిపోతుందేమో.! వేచి చూడాల్సిందే.
పూజా హెగ్దే (Pooja Hegde) చేసిన తొలి స్పెషల్ సాంగ్ ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమాలో.! అందులోని ‘జిగేలు రాణి’ స్పెషల్ సాంగ్ ఓ సంచలనం.
సో, ‘ఎఫ్3’ సినిమా నుంచి అంతకు మించిన సెన్సేషనల్ సాంగ్‌ని ఆశిద్దాం.! నెగెటివ్ సెంటిమెంట్ చెత్తబుట్టలో పడేద్దాం.!