Pooja Hegde Guntur Kaaram.. అయిపోయింది.! అంతా అయిపోయింది.! అవును, బుట్టబొమ్మ పూజా హెగ్దే ఖేల్ ఖతం అయిపోయింది.!
అంతేనా.? ప్చ్.! అంతేనేమో.! లేకపోతే, గురూజీ సినిమాలోంచి పూజా హెగ్దేని తీసెయ్యడమేంటి.? సెకెండ్ హీరోయిన్ శ్రీలీల కాస్త మెయిన్ హీరోయిన్ అవడమేంటి.?
పైగా, అది సూపర్ స్టార్ మహేష్‌బాబు సినిమా.! మహేష్, పూజా హెగ్దే కాంబినేషన్ అనగానే, ‘మహర్షి’ సినిమా గుర్తుకొస్తుంది కదా.!
Pooja Hegde Guntur Kaaram.. తీసేశారా.? నిజమేనా.?
పూజా హెగ్దేని (Pooja Hegde) తీసుకొచ్చి.. ఆ ప్లేస్‌లో శ్రీలీలను (Sreeleela) తీసుకొచ్చి.. శ్రీలీల ప్లేస్‌లోకి సంయుక్త మీనన్‌ని తీసుకొస్తున్నారట.

ఇదీ, ‘గుంటూరు కారం’ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం. కాదు కాదు, పూజా హెగ్దే ప్లేస్‌లోకే సంయుక్త మీనన్ (Samyuktha Menon) వస్తోందన్నది ఇంకో ప్రచారం.
శ్రీలీల కావొచ్చు, సంయుక్త మీనన్ కావొచ్చు.. పూజా హెగ్దే స్టార్‌డమ్‌తో పోటీ పడగలరా.? ఏమో, డౌటే.! గ్లామర్ విషయంలో అయినా.. పోల్చలేం ఆ ఇద్దర్నీ, పూజా హెగ్దేతో.

మేడమ్ సర్.. మేడమ్ అంతే.! కానీ, రోజులెప్పుడూ ఒకేలా వుండవ్ కదా.! కొత్త నీరు రావాల్సిందే.. పాత నీరుకి సెగ తగలాల్సిందే.!
గురూజీ.. ఎందుకిలా జరుగుతోంది.?
ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. అతన్ని మార్చేసి అనిరుధ్ రవిచందర్ లేదా, జీవీ ప్రకాష్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకర్ని తీసుకుంటారంటూ గాసిప్స్ వచ్చాయ్.
Also Read: తమన్నా.. తకధిమితోం.! ఓటీటీలో జుగుప్సకి పరాకాష్ట.!
తమన్ (Music Director SS Thaman) హర్ట్ అయ్యాడు.. సోషల్ మీడియా భగ్గుమంది. ఇంతలోనే ప్రకటన వచ్చింది.. సంగీత దర్శకుడు మారడంలేదని.

మరి, పూజా హెగ్దే (Pooja Hegde) విషయంలో ఎందుకు స్పష్టతనివ్వడంలేదు చిత్ర నిర్మాణ సంస్థ.? ఏమో.. ఏం జరిగిందో మరి.!
సాధారణంగా ఇలాంటి గాసిప్స్ వస్తే వెంటనే చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చేస్తుంటంది. తమన్ విషయంలో ఇచ్చిన క్లారిటీ, పూజా హెగ్దే విషయంలో రావడం లేదంటే.. తేడా కొడుతున్నట్టే.!