Pooja Hegde Special Item.. ‘ముకుంద’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అందాల భామ పూజా హెగ్దే.
ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్దే హవా కాస్త తగ్గినట్లు కనిపించినా ఇతర భాషల్లో బిజీగానే గడుపుతోంది.
ప్రస్తుతం ఆమె చేతిలో చాలానే ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయ్. అందులో ఒకటి తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ కూడా.
ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పేసి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్ధే నటిస్తోంది.
Pooja Hegde Special Item.. హీరోయిన్‌గా బిజీగా వుంటూనే..
అలాగే, హారర్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన లారెన్స్ రాఘవ డైరెక్షన్‌లో వస్తున్న ‘కాంచన 4’ మూవీలోనూ పూజా హెగ్ధే నటిస్తోంది.

ఇఆా హీరోయిన్‌గా ఆ స్థాయి స్టార్‌డమ్ వున్నప్పటికీ స్పెషల్ సాంగ్స్‌లోనూ సత్తా చాటుతుంటుంది పూజా హెగ్దే. గతంలో ‘రంగస్థలం’ సినిమా కోసం తొలి సారిగా స్పెషల్ సాంగ్‌లో పర్‌ఫామ్ చేసింది పూజా హెగ్ధే.
‘జిల్ జిల్ జిగేల్ రాణి..’ అంటూ సాగే ఈ పాట అప్పట్లో ఓ సంచలనం. ఆ తర్వాత మళ్లీ ‘ఎఫ్ 3’ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‌లో సీనియర్ హీరో వెంకటేష్, యంగ్‌స్టర్ వరుణ్ తేజ్‌తో అందంగా ఆడిపాడేసింది బుట్టబొమ్మ.
జిగేల్ రాణి మెరుపుల్
ఇక ఇప్పుడు మరోసారి తన జిగేల్ చూపించడానికి రాబోతోంది. ఈ సారి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో పూజా హెగ్ధే స్పెషల్ సాంగ్ చేయబోతోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ‘కూలీ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటూ, టాలీవుడ్ నుంచి నాగార్జున, ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర తదితరులు నటిస్తున్నారు.

హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తుండగా, పూజా హెగ్ధే ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయబోతోందని తెలుస్తోంది. ఈ మధ్యనే మిల్కీ బ్యూటీ తమన్నా రజనీకాంత్‌తో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది.
Also Read: Varsha Bollamma: మరీ అంత దారుణంగా తిట్టొద్దు ప్లీజ్.!
‘రా నువ్వు కావాలయ్యా..’ అంటూ సాగే ఈ సాంగ్ ఏ స్థాయిలో ట్రెండింగ్ అయ్యిందో తెలిసిందే. అలాగే, పూజా హెగ్ధే – సూపర్ స్టార్ స్పెషల్ సాంగ్ కూడా ఆ స్థాయిలో ట్రెండింగ్ అవుతుందేమో చూడాలిక.!
ఇక ఎప్పుడెప్పుడు స్పెషల్ సాంగ్‌లో జిగేల్ రాణిని చూస్తామా.? అని ఆమె అభిమానులు ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ‘కూలీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.