‘మేడమ్ సర్.. మేడమ్ అంతే..’ అంటాడు ఓ సినిమా హీరో.. ఆ సినిమాలో హీరోయిన్ ఇంకెవరో కాదు పూజా హెగ్దేనే. దాంతో, ఈ అందాల భామ ఇప్పుడందరికీ ‘మేడమ్’ అయిపోయింది. ఆమె లక్కు అలా వుంది మరి. హిట్టు మీద హిట్టు కొట్టేస్తోంది. అంతేనా, ఒకదాన్ని మించిన ఛాన్స్ ఇంకోటి.. అన్నట్టు అద్భుతమైన అవకాశాల్ని (Pooja Hegde Hottest Sensation) కొల్లగొట్టేస్తోంది.
ఈ ఏడాదిలో ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ హిట్ కొట్టేసిన పూజా హెగ్దే, అన్నీ కలిసొచ్చి వుంటే.. ఈ ఏడాది మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి వుండేది. ప్రస్తుతం అఖిల్‌తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ప్రభాస్‌తో చేస్తోన్న ‘రాధేశ్యావ్‌ు’ విడుదల కావాల్సి వున్నాయి.
వీటిల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ముందుగా రావొచ్చు. ‘రాధేశ్యామ్’ విడుదలకి మాత్రం సమయం పట్టే అవకాశాలున్నాయి. ఇదిలా వుంటే, పూజా హెగ్దే మరికొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో కూడా న్పించబోతోందట. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కోసం పూజా హెగ్దే పేరు విన్పిస్తోంది.
అయితే, హరీష్ – పవన్ కాంబో సినిమా పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయమే పట్టే అవకాశముంది. ఈలోగా పూజా హెగ్దే మరికొన్ని ప్రాజెక్టుల్లో కన్‌ఫామ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టాలీవుడ్‌లో ఇప్పుడు హాటెస్ట్ బ్యూటీ ఎవరన్నా వుంటే.. అది పూజా హెగ్దే మాత్రమేనేమో.
టాలీవుడ్‌లోనే కాదు, ఈ బ్యూటీకి బాలీవుడ్‌లోనూ అస్సలేమాత్రం ఖాళీ లేదు. అయినాగానీ అటు బాలీవుడ్‌నీ, ఇటు టాలీవుడ్‌ని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతోంది. సినిమా సినిమాకీ రేంజ్ పెంచుకుంటూ వెళుతోన్న పూజా, ఆల్రెడీ తెలుగులో ఓన్ డబ్బింగ్ చెప్పుకుని, ప్రేక్షకులకి మరింత చేరువైన విషయం విదితమే.
బాలీవుడ్ క్రేజ్ కూడా అదనంగా ఈ భామకి వుండడంతో, పాన్ ఇండియా సినిమాలకు పూజా హెగ్దే (Pooja Hegde Hottest Sensation) బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయిందిప్పుడు.