Pooja Hegde Wedding Gossips.. ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమని అన్నాడట వెనకటికి ఒకడు.! పూజా హెగ్దే పెళ్ళి పుకార్లు కూడా అలాగే వున్నాయ్.!
బుట్ట బొమ్మ పూజా హెగ్దే ప్రస్తుతం కెరీర్‌లో ఒకింత డల్ ఫేజ్‌ని చూస్తోంది. చేతిలో వున్న ప్రాజెక్టుల్ని చేజార్చుకుంటోంది పూజా హెగ్దే.
మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ సినిమా చేయాల్సి వుండగా, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
ఇక, పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి కూడా పూజా హెగ్దే తప్పుకున్న సంగతి తెలిసిందే.
Pooja Hegde Wedding Gossips.. క్రికెటర్‌తో పెళ్ళా.? నిజమెంత.?
కాగా, పూజా హెగ్దే పెళ్ళంటూ ఓ పుకారు షికారు చేస్తోంది సినీ వర్గాల్లో. పైగా, ఓ క్రికెటర్‌తో పూజా హెగ్దే పెళ్ళి.. అన్నది ఆ పుకారు సారాంశం.

క్రికెటర్లకీ.. అందాల భామలకీ మధ్య ‘ప్రేమ’ కొత్త విషయం కాదు. అయితే, పూజా హెగ్దే డేరింగ్ అండ్ డాషింగ్.! దేన్నీ దాచే వ్యవహారమే కాదు.!
‘నా పెళ్ళి గురించి చెప్పాలనుకున్నప్పుడు చెప్తా.. దాచాల్సిందేమీ ప్రస్తుతానికి లేదు..’ అని పూజా హెగ్దే తాజాగా సెలవిచ్చింది.
స్నేహితులు అన్ని చోట్లా వున్నారుగానీ..
‘ప్రేమలో పడితే, ఖచ్చితంగా ఆ ప్రేమని ఆస్వాదిస్తా.. ఆ వివరాలూ చెబుతా. పెళ్ళి అయితే ఎవరికీ చెప్పకుండా చేసుకునేది కాదు కదా..’ అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్దే చెప్పిన విషయాల్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
Also Rad: కృతి సనన్.! బోల్డ్ అండ్ వైల్డ్ యాక్షన్.!
ప్రస్తుతానికైతే సినిమా కెరీర్‌ని ఎంజాయ్ చేస్తున్నానన్న పూజా హెగ్దే, టాలీవుడ్, కోలీవుడ్ సహా బాలీవుడ్‌లో తనకెంతోమంది స్నేహితులున్నారనీ.. అందులో ‘బాయ్స్’ కూడా వున్నారనీ పూజా హెగ్దే చెప్పుకొచ్చింది.
క్రికెటర్, బిజినెస్ మేన్, యాక్టర్.. ఇలా ఎవరితో ప్రేమలో పడినా, ఆ విషయాన్ని తానే ముందుగా మీడియాలో చెబుతానంటోంది పూజా హెగ్దే.