Prabhas Fever ‘బాహుబలి’ ప్రభాస్‌కి జ్వరం రావడమేంటి.? ఔను కదా.? పాన్ ఇండియా రెబల్ స్టార్‌కి జ్వరం వస్తే.. ఇంకేమన్నా వుందా.?
ఆగండాగండీ.. ప్రభాస్ కూడా ఓ మామూలు మనిషే.! జలుబు, జ్వరం.. ఇలాంటి సాధారణ అనారోగ్య సమస్యలు ఆయనకీ ఎదురవుతాయ్.
నేటి పాత్రికేయంలో విలువలెక్కడున్నాయ్.? గాసిప్ ప్రధాన వార్తలకే పరిమితమవుతోంది మెజార్టీ మీడియా.! అసలు పాత్రికేయమెక్కడుంది.? గాలి వార్తల్ని పోగెయ్యడం తప్ప.!
సెలబ్రిటీకి జ్వరం వస్తే వార్త.. జ్వరం వచ్చి తగ్గిపోయాక వారం రోజుల తర్వాత కూడా అది వార్తే.! ఇదీ నేటి పాత్రికేయం.!
పైగా, మళ్ళీ విలువల గురించి విలువల వలువలూడ్చేసినోళ్ళే పాత్రికేయం ముసుగులో చర్చ పెట్టడం.. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
Mudra369
కానీ, ప్రభాస్‌కి జ్వరం వస్తే.. అదో నేషనల్ ఇష్యూ అయిపోయింది.! కాదు కాదు, దాన్నొక జాతీయ సమస్యగా మార్చేశారు.!
Prabhas Fever మీడియా వెకిలితనం..
సెలబ్రిటీల ఇంట్లో శుభకార్యాలెలాగూ మీడియాకి పండగే.! అది అందరికీ తెలిసిన విషయాలే. సెలబ్రిటీల ఇళ్ళలోని విషాదాలు కూడా మీడియాకి పండగానే తయారయ్యాయ్.
అలాగే, ప్రభాస్ అనారోగ్య సమస్య కూడా.! ప్రభాస్‌కి జ్వరమొచ్చింది.. షూటింగ్‌కి ఇబ్బంది ఏర్పడింది. సినిమా అన్నాక ఇలాంటివన్నీ మామూలే.
విషయాన్ని బయటకు లీక్ చేసి.. బయట ఏం రచ్చ జరుగుతోందో చూసి.. ఆ రచ్చ మీద మళ్ళీ విశ్లేషించి.. శునకానందం పొందుతున్నారు కొందరు.
నిజమే.. పాత్రికేయం దిగజారిపోయింది..
డౌటేముంది.? పాత్రికేయం దిగజారిపోయింది. సెలబ్రిటీల మధ్య లేని సంబంధాల్ని అంటగట్టేసి పైశాచికానందం పొందే స్థాయికి పాత్రికేయం ఏనాడో దిగజారిపోయింది.
ఆసుపత్రిలో చేరితే చాలు, తీవ్ర అనారోగ్యం.. అని చెప్పడమే కాదు, చచ్చిపోయారని కూడా డిక్లేర్ చేసే స్థాయికి పాత్రికేయం ఎప్పుడో నైతికతకి పాతరేసేసింది.
Also Read: Prabhs Fever
చిత్రమేంటంటే.. నిండా బురదలో కూరుకుపోయిన.. ఆ దిక్కుమాలిన పాత్రికేయమే నీతులు చెబుతుండడం. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
ప్రభాస్‌కి వచ్చిన జ్వరం తగ్గిపోయింది.! అసలు తగ్గిపోయాకే వార్త వెలుగు చూసింది. కానీ, పాత్రికేయానికి పట్టిన ది ‘గ్రేట్’ జాడ్యమెలా వదులుతుంది.?