Prabhas Hanu No Sreeleela.. ప్రబాస్ సరసన శ్రీలీల.. అంటూ ఈ మధ్య ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. ఇంకేముంది.! శ్రీలీలను పట్టుకోవడం ఎవ్వరి వల్లా కాదన్నారు.
అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. ఇంతకీ ప్రబాస్ (Prabhas) నటిస్తున్న ఆ సినిమా ఏంటీ.? అసలు కథేంటీ.? అంటే.!
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రబాస్ ఓ సినిమా చేయాల్సి వుంది. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ విషయమే తాజా ప్రచారం తాలూకు సారాంశం.
Prabhas Hanu No Sreeleela.. శ్రీలీలకి అంత సీను లేదా.?
అయితే, ఈ సినిమాలో హీరోయిన్ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంట. శ్రీలీల (Sreeleela) పేరయితే అసలు పరిశీలనలోనే లేదనేది ఇన్‌సైడ్ వర్గాల సమాచారం.
శ్రీలీల కాకుంటే ఇంకెవరు.? ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటారనీ తెలుస్తోంది.

అందులో ఒకరు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అంటున్నారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా ఏ స్థాయిలో విజయం అందుకుందో.. ఆ స్థాయి విజయానికి కారణమైన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కి ఎంత పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నాడా.?
సో, తన తదుపరి సినిమా హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ పేరునే ప్రధమ పరిశీలనగా హను రాఘవపూడి తీసుకోవాలనుకుంటున్నాడనీ ఆయన సన్నిహితుల ద్వారా అందుతోన్న సమాచారం.
ఇక, మరో హీరోయిన్ పేరుకి సంబంధించి పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో వున్నాయట. రష్మిక, పూజా హెగ్ధే తదితర ముద్దుగుమ్మలనీ అంటున్నారు.
ప్రబాస్ సినిమా కదా.. పలువురు నార్త్ హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలనలో వున్నాయట.
Also Read: రష్మికకి ఘోర అవమానం.! ఇంతకీ, ఏం జరిగిందక్కడ.?
ఎలా చూసినా శ్రీలీల పేరయితే, అసలు హను రాఘవపూడి దృష్టిలో లేదట ఇంతవరకూ. చూడాలి మరి, ఈక్వేషన్స్ ఏమైనా ఛేంజ్ అయితే చెప్పలేం. ఇప్పటికైతే ఇంతే అని తెలుస్తోంది.!