Prabhas Hrithik Roshan.. చేతిలో ఐదారు ప్రాజెక్టులు సిద్ధంగా వున్నాయ్. అయినా కొత్త కథలను వినడానికి, నచ్చితే ఓకే చేసేయడానికి సిద్ధంగా వున్నాడు డార్లింగ్ ప్రబాస్.
ఆ క్రమంలోనే ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడికి కమిట్ అయ్యాడు ప్రబాస్. ఆయన మరెవరో కాదు, సిద్దార్ధ్ ఆనంద్. ‘పఠాన్’ సినిమాతో లేటెస్ట్‌గా సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ఈయన.
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సిద్దార్ధ్ ఆనంద్, యూనివర్సల్ స్టార్ అయిన ప్రబాస్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడన్న వార్త గత కొంత కాలంగా వినిపిస్తోంది.
Prabhas Hrithik Roshan.. కాంబో సెట్ అయ్యింది కానీ.!
అయితే, అదంతా వుత్త ప్రచారమే అన్నారు. కానీ, ఆ వార్తలో ఒకింతయినా నిజం లేకపోలేదంటున్నారు. స్వతహాగా రైటర్ అయిన సిద్ధార్ధ్ ఆనంద్, యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసుకున్నాడు.
Also Read: మేడమ్ కృతి సనన్.! మేటరేంటి ప్రభాస్.!
ఆల్రెడీ హృతిక్‌తో ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ సినిమాలతో రెండు యాక్షన్ హిట్స్ కొట్టేసిన సిద్ధార్ధ్ హ్యాట్రిక్ కోసం ప్లాన్ చేస్తున్నాడట. ఆ సినిమా కోసమే ప్రబాస్‌ని ఎంగేజ్ చేశారనేది తాజా ప్రచారం తాలూకు సారాంశం.
అంటే, హృతిక్ రోషన్, ప్రబాస్ కాంబో దాదాపు సెట్ అయినట్లే అని తెలుస్తోంది. ఇక్కడే చిన్న ట్విస్ట్ వుందట. ఈ ప్రాజెక్ట్‌లో ప్రబాస్ కేవలం భాగస్వామి కానున్నాడంతే.
గ్రీకువీరుడి కోసం డార్లింగ్..
పూర్తి స్థాయి పాత్ర కాదట ప్రబాస్‌ది కొన్ని నిముషాల పాటు మాత్రమే కనిపించే గెస్ట్ రోల్ అనీ తెలుస్తోంది.
అయినా ఆ పాత్రను చాలా పవర్ ఫుల్‌గా తీర్చి దిద్దబోతున్నాడట సిద్దార్ధ్ ఆనంద్. ‘గాడ్ ఫాదర్’ కోసం సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించారు.
అలాగే, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కోసం డార్లింగ్ ప్రబాస్ రంగంలోకి దిగబోతున్నాడన్నమాట. ఏది ఏమైనా ఈ కాంబినేషన్ ఒకింత ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తోంది.
అన్నట్లు సిద్దార్ద్ ఆనంద్ తనతో కలిసి పని చేసిన హీరోలను రిపీట్ చేస్తుంటాడు. అలాగే, ఇప్పుడు గెస్ట్ రోల్ కోసం ప్రబాస్‌ని తీసుకున్నా, భవిష్యత్తులో ఫుల్ లెంగ్త్‌లో ప్రబాస్‌తో ఓ మాంచి యాక్షన్ ధమాకా ఇవ్వకపోడూ.!