Table of Contents
Pradosha Kalam.. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో ప్రదోష కాలం అనే మాట తరచూ వింటుంటాం.
తిథుల్లో త్రయోదశి, చతుర్దశి చాలా ప్రత్యేకమైనవని చెబుతుంటారు. అలాగే, ప్రదోష కాలం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు.
వారాలలో బుధవారం, గురువారం విశిష్టమైనవిగా పండితులు అభివర్ణించడం తెలిసిన విషయమే.
ఇంతకీ, ప్రదోష కాలం అంటే ఏమిటి.? వాస్తవానికి రాత్రి వేళ ప్రదోషంతో ప్రారంభం అవుతుంది. అనగా, సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య సమయం అని అర్థం చేసుకోవాలి.
Pradosha Kalam.. శాస్త్రాలు, పురాణాలు.. ఏం చెబుతున్నాయి.?
ఈ ప్రదోష కాలంలో, శివయ్యను పూజిస్తే మంచిది. పరమేశ్వరుడిని పూజించడం అలానే శివ పంచాక్షరీ ధ్యానం..
ఇవన్నీ మానసిక ప్రశాంతతను ఇస్తాయట. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందిట.

కాగా, త్రయోదశికి మన్మథుడు అలాగే చతుర్దశికి కలి పురుషుడు అధిపతులని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరినీ నియంత్రించి, నిలువరించాలంటే అది పరమేశ్వరుడికి మాత్రమే సాధ్యం.
బుధ, గురువారాల గురించి ప్రస్తావించేటప్పుడు, అవి బుద్ధికీ అలానే మాటకీ సంకేతాలుగా చెబుతారు.
అందుకే, నిత్యం ప్రదోష కాలంలో శివారాధన సాధ్యం కాని వారు, ఈ రోజుల్లో ఈ తిథుల్లో ప్రదోష కాలంలో శివారాధన చేస్తే మంచి ఫలితాలు వుంటాయి.
ఓం నమఃశివాయ..
పరమ శివుడిని ప్రసన్నం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనీ, శివలింగానికి నీటితో అభిషేకం చేసినా చాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
బిల్వ పత్రంతో కూడిన జలాభిషేకం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.

‘ఓం నమః శివాయ’ అంటూ మనస్ఫూర్తిగా శివారాధన చేయడం, శివ లింగానికి భక్తితో ఓ పుష్పం సమర్పించడం, వీలైతే బిల్వ పత్రంతో కూడిన జలాబిషేకం చేయడం.. ఇవన్నీ ఉత్తమం.
పరమ శివుడికి ప్రీతికరమైన ప్రదోష కాలంలో ఇవన్నీ చేస్తే, ఆ పరమేశ్వరుని కృప ఎల్లప్పుడూ మీ మీద వుంటుంది నిస్సందేహంగా.
పాప నిర్మూలన..
ప్రదోషమంటే పాప నిర్మూలన కూడా. తెలిసీ తెలియక చేసే పాప కర్మల తాలూకు ప్రతిబంధకాలను కొనితెచ్చుకున్నప్పుడు పుణ్య కర్మలు చేస్తే ఉపశమనం కలుగుతుంది.
Also Read: ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం
కంఠాన హాలాహలాన్ని ధరించిన శివుడు, మన కష్టాల్ని తొలగించాలంటే ప్రమద గణాలతో కొలువయ్యుండే ప్రదోష కాలంలో ఆ పరమ శివుడ్ని స్మరించుకోవాలి.
అలా చేస్తే మన కష్టాల్ని శివుడే స్వీకరించి, మనల్ని ఆశీర్వదిస్తాడని పండితులు పేర్కొంటున్నారు.
