Pragya Jaiswal Red Rose.. అందం తినేసి పుట్టేసిందా.? ఆ అందం తాగుతూనే పెరిగిందా.? అన్నట్లుండే అందం ఆమె సొంతం. ఆమె ఎవరో కాదు..జబల్ పూర్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్.
‘కంచె’ సినిమాతో తెలుగు సినీ జనాన్నిట్రెడిషనల్‌గా పలకరించింది. తొలి సినిమాకే క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. పలు మార్లు పడి లేచిన కెరటంలా దూసుకొచ్చింది.
కానీ, అదృష్టం ఆమెని రేస్‌లో వెనకబడేసింది. ఎంత ప్రయత్నించినా ముందుకు సాగడానికి సహకరించలేదు. ట్రెడిషనల్ గ్లామర్‌తో పరిచయమైన ప్రగ్యా జైశ్వాల్.. ఆ తర్వాత హద్దులు మీరింది.
అకస్మాత్తుగా అందాల ‘కంచె’ తెంచేసి.!
అందాల కంచెలు తొలగించేసింది.. ఐటెమ్ సాంగ్‌కైనా ఓకే అనేలా సంకేతాలు పంపించింది. ‘నక్షత్రం’ సినిమాలో ఓ స్సెషల్ సాంగ్ కోసం పొట్టి దుస్తుల్లో భీభత్సంగా చెలరేగిపోయింది.

అయినా అవకాశాలు అంతంత మాత్రమే ప్రగ్యాకి. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా స్కిన్ షోకి షాకై షేక్ అవ్వని కుర్రకారు లేరంటే అతిశయోక్తి కాదేమో.
బాలయ్య పుణ్యమా అని లాంగ్ గ్యాప్ తర్వాత ‘అఖండ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఛాన్స్ రావడమే కాదు, అఖండమైన విజయం కూడా అందుకుంది ఆ సినిమాతో ప్రగ్యా జైశ్వాల్.
Pragya Jaiswal Red Rose.. ‘అఖండ’మైన గెలుపు.! దశ తిరిగినట్లేనా.!
ఇంకేముంది.! ఆ తర్వాత ప్రగ్యా జైశ్వాల్ కెరీర్ టర్న్ అయినట్లే అనుకున్నారంతా.! అయినా కానీ, అమ్మడికి లక్కు తిరగబడలేదు.
అయితేనేం, సోషల్ మీడియాలో ప్రగ్యా జైశ్వాల్ యమా యాక్టివ్. అస్సలు విరామం లేకుండా అందాల ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది.

‘భంగిమ.. భంగిమ’ అంటూ అదేదో సినిమాలో డైలాగ్ వుంటుంది.. ఆ మాదిరి భిన్నమైన భంగిమల్లో అందాలారేస్తూ కవ్విస్తుంటుంది.
ఆ క్రమంలోనే తాజాగా రెడ్ అవుట్ ఫిట్‌లో ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాని షేకెత్తిస్తున్నాయ్.
Also Read: రష్మికపై నిర్దాక్షిణ్యంగా ట్రోలింగ్.! ఏం పాపం చేసిందని.?
‘ఎరుపెక్కిన పగ్యానందం.. నిజంగానే నయనానందం..’ అంటూ కుర్ర కవులు ప్రగ్యా అందాల్ని తెగ పొగిడేస్తోంటే..!