Prakash Raj Anti National.. ఎవరూ మొహాన ఉమ్మేయాల్సిన పనిలేదు.. తమ మొహాన తామే ఉమ్మేసుకోగలం.. అన్నట్లుంది ప్రకాష్ రాజ్ వ్యవహార శైలి.!
ప్రకాష్ రాజ్ మాత్రమే కాదు, ఆయనతోపాటు జర్నలిస్టుగా చెప్పుకు తిరిగే ఇంకో ‘సెలబ్రిటీ’ కూడా, ‘అంధ్ భక్త్’ల దృష్టిలో ‘యాంటీ నేషనల్స్’ అంటూ తమ ఘనతని చెప్పుకున్నారు.
ఫొటోలో వున్న వాళ్ళలో ప్రకాష్ రాజ్, సినీ నటుడు గనుక.. అందరికీ తెలుసు. మిగతా ముగ్గురిలో ఇద్దరు జర్నలిస్టులు. అందులో ఒకరు మహిళా జర్నలిస్టు తులసి చందు.
Prakash Raj Anti National.. హిందూ వ్యతిరేకులు..
ముగ్గురిదీ ఒకటే జెండా.. ఒకటే ఎజెండా.! ముగ్గురు కాదు, నలుగురిదీ అదే జెండా, ఎజెండా కాబట్టే.. ఒకే చోట గుమికూడారు, ‘దేశ ద్రోహులం’ అని చెప్పుకున్నారు.
‘యాంటీ నేషనల్స్ ఇన్ వన్ ఫ్రేమ్..’ అని పేర్కొంటూ, ‘జస్ట్ ఆస్కింగ్’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు సినీ నటుడు ప్రకాష్ రాజ్.
చిత్రమేంటంటే, ఫొటోలో కనిపిస్తున్న నలుగురిలో ముగ్గురు, గత కొంతకాలంగా జన సేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారు.
రాజకీయ విమర్శలైతే ఫర్లేదు, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న సనాతన ధర్మంపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రకాష్ రాజ్, తులసీ చందు తదితరులు.
తమిళనాడులో, ‘టీవీకే’ అధినేత విజయ్ ఇటీవల నిర్వహించిన ఓ బహిరంగ సభలో, నలభై మంది ప్రాణాలు కోల్పోతే, ఈ ముగ్గురిలో ఒక్కరూ స్పందించలేదాయె.
Also Read: శతృవుల గుండెల్లో ‘ధ్వని’.! భారత హైపర్ సోనిక్ మిస్సైల్.!
ఎందుకంటే, విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్. ప్రకాష్ రాజ్, తులసి చందు సంగతి తెలిసిందే.!
ఇక, జర్నలిస్టు ముసుగేసుకున్న తులసి చందు, సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్‌తో కలిసి వున్న ఫొటోని షేర్ చేస్తూ, ‘అంధ్ భక్త్’ల దృష్టిలో, మేం ‘యాంటీ నేషనల్స్’ అని పేర్కొన్నారు.
సనాతన ధర్మాన్ని అనుసరించేవారంతా ‘అంధ్ భక్తులైతే’, మరి ప్రకాష్ రాజ్ అలాగే తులసి చందు దృష్టిలో.. వీళ్ళని అనుసరించేవారంతా, ‘అంధ్ గొర్రెలు’ అనుకోవచ్చా.?
నలుగురూ నవ్విపోదురుగాక.. వీళ్ళకేటి సిగ్గు.?
