Pranitha Subhash Buttabomma.. అమ్మో.! బాపు గారి బొమ్మో..! అంటూ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో అందంగా పొగిడించుకున్న ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్.. గుర్తుంది కదా.!
అంతకు ముందే ఎన్టీయార్ తదితర హీరోలతోనూ జత కట్టిందీ అందాల బొమ్మ. అయితే, కెరీర్ బాగున్న టైమ్‌లోనే పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమైంది.
ఓ బిడ్డకి తల్లయ్యాకా, మళ్లీ ఇప్పుడే సినిమాలపై ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తెగ హల్‌చల్ చేస్తోంది.
Pranitha Subhash Buttabomma.. మిసెస్ అయినా అస్సలు ‘మిస్’ కాని గ్లామర్.!
మిసెస్ అయినా మదర్ అయినా కానీ, ప్రణీతలో గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదేమో. ఇంకాస్త ముద్దుగా అందంగా తయారైందంటున్నారు ఆమె పిక్స్ చూసి నెటిజన్లు.
ఈ నేపథ్యంలోనే ప్రణీత మళ్లీ హీరోయిన్‌గా సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోందట. ఇప్పటికే కొన్ని కథలు కూడా వినిందని సమాచారం.

అయితే, లీడ్ హీరోయిన్ రోల్స్ కాకుండా, సెకండ్ హీరోయిన్ రోల్స్ వస్తున్నాయట ప్రణీత సుభాష్‌కి. అయినా, అంతకు ముందు కూడా ప్రణీత ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్సే చేసిందనుకోండి.
కానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంపార్టెన్స్ వున్న రోల్స్, తనలోని నటికి ఛాలెంజ్ విసిరే పాత్రల కోసం ప్రయత్నాలు చేస్తోందట ప్రణీత సుభాష్ (Pranitha Subhash).
సెకండ్ ఇన్నింగ్స్ సరికొత్తగా..
అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా కావచ్చునట. అలాగని గ్లామర్ పాత్రలకు తానేం దూరం కాదంటోంది. ఆ మాటకొస్తే, గ్లామర్ ఎలివేట్ చేస్తూ ఇంపార్టెన్స్ వున్న రోల్స్ అయితే ఇప్పటికిప్పుడు ఓకే చేసేసేలా వుందట ప్రణీత.
Also Read : అప్పుడు వద్దన్నావట.! ఇప్పుడు ఎగబడుతున్నావట.!
సినిమాల్లో ఛాన్సుల సంగతి అటుంచితే, ఇప్పటికిప్పుడు మాత్రం ప్రణీత ( Pranitha Subhash) చేస్తున్న సోషల్ మీడియా గ్లామర్ హంగామాకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
తాజాగా బ్లాక్ కలర్ బుట్ట గౌనులో ప్రణీత సుభాష్ అందాల ఆరబోత వావ్ అనిపిస్తోంది. లాంగ్ ఫ్రాకే కానీ, ఎక్కడ చూపించాల్సిన అక్కడ చూపిస్తూ, ట్రెండీగా కనిపిస్తూనే కావల్సినంత హాట్ అప్పీల్ ఇస్తోంది.