Priyanka Chopra Tollywood Dhamaka.. ప్రియాంక చోప్రాని బాలీవుడ్ కూడా భరించలేని పరిస్థితి. అలాంటిది, తెలుగులో ఆమె ఓ సినిమా చేస్తోంది. అదే, ‘వారణాసి’.!
రాజమౌళి, తెలుగు సినిమాకి ‘ప్రియాంక చోప్రా’ని తీసుకొస్తున్న దరిమిలా, ఆమెకు బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చేందుకు రంగం సిద్ధమైంది.
కొన్ని పెద్ద బ్యానర్లు, ప్రియాంక చోప్రాతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయట.
కొందరు దర్శకులూ, ప్రియాంక అయితే తమ సినిమాలో బావుంటుందంటూ, నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా ఖబర్ ఏంటంటే, ప్రియాంక చోప్రా మరో తెలుగు సినిమాకి కమిట్ అయ్యిందట. అది కూడా, ప్రియాంక చోప్రా రేంజ్‌ని భరించే సినిమానే కావడం గమనార్హం.
Priyanka Chopra Tollywood Dhamaka.. రెమ్యునరేషన్ ఆకాశంలో..
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ అంటే, రెమ్యునరేషన్ ఆకాశంలో వుంటుంది. సినిమా ప్రమోషన్లకు అస్సలు సహకరించదు.. ఇదీ, బాలీవుడ్‌లో నిన్న మొన్నటిదాకా వినిపించిన మాట.
కానీ, ఇప్పుడు ప్రియాంక చోప్రా ఆలోచనలు మారాయి. రెమ్యునరేషన్ విషయంలో కొంచెం ఫ్లెక్సిబుల్‌గానే వుంటోందిట. ఈ కారణంగానే, ప్రియాంకకి మరో తెలుగు సినిమాలో ఛాన్స్ దక్కిందని అంటున్నారు.
అయితే, అది ఏ సినిమా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ‘కల్కి’ సీక్వెల్ నుంచి ఇటీవల దీపిక పదుకొనేని తప్పించిన సంగతి తెలిసిందే.
కల్కి సీక్వెల్‌లో.. దీపిక స్థానంలో.?
ఆ ‘కల్కి’ సీక్వెల్‌లోనే, దీపిక పదుకొనే స్థానంలోకి ప్రియాంక చోప్రా వచ్చిందన్నది ఓ గాసిప్. ఈ విషయమై నిర్మాణ సంస్థ నుండి కన్ఫర్మేషన్ రావాల్సి వుంది.
అన్నట్టు, ప్రియాంక చోప్రా చాలా కాలం క్రితం ఓ తెలుగు సినిమాలో నటించినా, అది విడుదలకు నోచుకోలేదు.!
ఇదిలా వుంటే, ప్రియాంక చోప్రాకి వున్న పాపులారిటీ నేపథ్యంలో, ఆమెతో స్పెషల్ సాంగ్స్ చేయించాలనే ప్రయత్నాలూ జోరందుకున్నాయి టాలీవుడ్ నుంచి.
ప్రస్తుతానికి ప్రియాంక చోప్రా, స్పెషల్ సాంగ్స్ విషయంలో అంత ఆసక్తి చూపడంలేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
