సోషల్ మీడియా పట్ల తనకు అస్సలేమాత్రం ఆసక్తి లేదంటూ గతంలో వ్యాఖ్యానించిన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ (Bollywood Queen Kangana On Twitter), ఆ సోషల్ మీడియాకి వున్న ‘శక్తి’ ఏంటో తెలుసుకుంది. ఒకప్పుడు, సోషల్ మీడియా అంటేనే చిరాకు పడిన ఈ బాలీవుడ్ క్వీన్, ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల చాలా ఆనందంగా వుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
కంగనా రనౌత్ (Kangana Ranaut) అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ‘వివాదాలతోనే ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యింది’ అని అంటారు కొందరు. కానీ, డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ ఆమె సొంతమని అంటారు ఇంకొందరు. ఎవరెలా అనుకున్నా, కంగనా రనౌత్ అంటే ఇప్పుడు ఫైర్ బ్రాండ్. వివిధ అంశాలపై కంగనా రనౌత్ తన అభిప్రాయల్ని కుండబద్దలుగొట్టేస్తుంటుంది.
కొన్నాళ్ళ క్రితం వరకూ కంగన తరఫున ఆమె సోదరి సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్స్ చేస్తుండేది. కానీ, ఇకపై అలా కాదు. కంగన తనంతట తానుగా సోషల్ మీడియాలో చాలా చాలా అంశాలపై స్పందించబోతోంది. రాజకీయాలు, సినిమా, విమెన్ ఎంపవర్‌మెంట్.. ఇలా అన్ని అంశాలపైనా తన అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా చెబుతానంటోంది కంగనా రనౌత్.
ఇంకేముంది.? రోజుకో కొత్త వివాదం తెరపైకి రాబోతోందన్నమాట.! ఇదీ బాలీవుడ్‌లో మెజార్టీ అభిప్రాయం. అయితే, కంగన సపోర్టర్స్ మాత్రం తమ ‘క్వీన్’కి గ్రాండ్ వెల్‌కవ్‌ు చెబుతున్నారు. కంగన రాకతో సోషల్ మీడియాలో కొత్త శకం షురూ అవుతుందని కంగన అభిమానులు చెబుతుండడం గమనార్హం.
కేవలం వివాదాలతోనే ఎవరూ పాపులర్ అయిపోరు. ముక్కుసూటితనం, గ్లామర్, యాక్టింగ్ టాలెంట్, విషయ పరిజ్ఞానం.. ఇలా అన్నీ వున్నాయి కాబట్టే, కంగన ఈ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది. ఏదిఏమైనా, కంగనా రనైత్ అభిమానులకి ఇది నిజంగానే పెద్ద పండగ.
అన్నట్టు, కంగన (Bollywood Queen Kangana On Twitter) తాను సోషల్ మీడియాలోకి వస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియో కూడా విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. చూద్దాం, కంగన సోషల్ మీడియా ఎంట్రీతో ఎలాంటి సరికొత్త సంచలనాలకు తెరలేపుతుందో.