Rahul Gandhi MP Congress లోక్ సభ సభ్యుడి మీద అనర్హత వేటు పడటమంటే చిన్న విషయం కాదు.!
హత్యలు చేసి, దోపిడీలకు పాల్పడి, మహిళలపైనా అఘాయిత్యాలు చేసేవారిని చట్ట సభలకు రాజకీయ పార్టీలు పంపుతున్న రోజులివి.!
చిత్రమేంటంటే, ఆయా కేసులు ఏళ్ళ తరబడి విచారణ విషయంలో సాగతీతకు గురవుతుంటాయి.
విచారణకు సహకరించాల్సిన ప్రజా ప్రతినిథులు.. కుంటిసాకులు చెబుతూ, ఆయా విచారణల్ని సాగదీస్తుంటారు.. ఈలోగా తమ రాజకీయ పబ్బం గడుపుకుంటుంటారు.
Rahul Gandhi MP Congress.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు..
అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీద అభియోగం. న్యాయస్థానం ఈ కేసులో ఆయన్ని దోషిగా తేల్చింది.
అంతే, మరుక్షణం అనర్హత వేటు పడిపోయింది. లోక్ సభ సభ్యుడిగా అప్పటివరకూ వున్న రాహుల్ గాంధీ, ఒక్కసారిగా ‘మాజీ’ అయిపోయారు.!

ఇదెక్కడి రాజకీయం.? అని దేశమంతా ముక్కున వేలేసుకుంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని సమర్థించడం కాదిక్కడ.
పొద్దున్న లేస్తే, రాజకీయ నాయకులు మాట్లాడే వివాదాస్పద వ్యాఖ్యలతోనే నిండిపోతుంటుంది.. ఇడియట్ బాక్స్.!
న్యూస్ ఛానళ్ళ నిండా రాజకీయ రోత తప్ప ఇంకేమీ వుండదు. వాటిని పరిగణనలోకి తీసుకుంటే, ఒక్కరంటే.. ఒక్కరు కూడా చట్ట సభల్లో వుండరు. దాదాపుగా చట్ట సభలన్నీ ఖాళీ అయిపోతాయ్.!
న్యాయస్థానంలో ఊరట.. ఎంపీ పదవి పునరుద్ధరణ..
సర్వోన్నత న్యాయస్థానంలో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దాంతో, రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్ సభ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
రాహుల్ గాంధీ గెలిచారు.! ఇంతకీ, ఓడిపోయిందెవరు.? పరువు నష్టం దావా కేసులో దోషిగా తేలితే.. ఓ ప్రజా ప్రతినిథి మీద అనర్హత వేటు పడటమేంటి.?
Also Read: నడి రోడ్డు మీద ‘నిస్సిగ్గు రాజకీయం’ గుడ్డలూడదీసిన ‘బ్రో’.!
చర్చ జరగాలి ఈ విషయమై పౌర సమాజంలో.! వ్యవస్థలు ఎవరి కోసం పని చేస్తున్నాయ్.? అన్నదానిపై సమాజంలోనే ఆత్మవిమర్శ జరగాలి.!
వ్యవస్థలు.. దేశంలో ప్రతి పౌరుడి విషయంలో ఒకే రకమైన బాధ్యతతో వ్యవహరించాల్సి వుంటుంది.!
పార్టీల వారీగా పౌరుల్ని, ప్రజా ప్రతినిథుల్ని విడదీసి.. తదనుగుణంగా, తమకు అనుకూలంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసే రాజకీయం.. ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం.!