Rajtarun Rashi Singh.. ఎలాంటోడు ఎలా అయిపోయాడో.! అనుకోకుండా హీరో అయిపోయి, తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు రాజ్ తరుణ్.!
వరుస ఫ్లాపులతో బాక్సాఫీస్ మీద నిర్దయగా దండయాత్ర చేస్తూనే వున్న రాజ్ తరుణ్ నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా టైటిల్ ‘పాంచ్ మినార్’.
రాజ్ తరుణ్ సరసన ఈ ‘పాంచ్ మినార్’ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించింది. సినిమా ప్రమోషన్లు గట్టిగానే ప్లాన్ చేశారట.
Rajtarun Rashi Singh.. కెరీర్‌కి పర్సనల్ లైఫ్ షాక్..
రాజ్ తరుణ్ కెరీర్‌కి పర్సనల్ లైఫ్ షాకిస్తోంది. ఓ అమ్మాయితో సహ జీవనం.. ఈ క్రమంలో ఇంకో అమ్మాయితో రచ్చ.. వెరసి, రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ వరస్ట్‌గా తయారైంది.
ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్ల సమయంలో, ఈ సహజీవనం రగడ తారాస్థాయికి చేరింది. రాజ్ తరుణ్‌ని సగటు సినీ ప్రేక్షకుడు మర్చిపోయిన ఆ సందర్భంలో ఆ వివాదం అతనికి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది.

మళ్ళీ షరామామూలే.! ఇప్పుడు మళ్ళీ ఆ పర్సనల్ లైఫ్ గొడవలు వార్తల్లోకెక్కుతున్నాయి. ఇదీ సినిమా పబ్లిసిటీ స్టంట్‌లో భాగమేనా.?
Also Read: ‘మంచు’ కురిసిపోవడం ఏంటి శ్రీవిష్ణూ! తప్పు కదా ‘శివయ్యా’.!
ఏదిఏమైనా, రాజ్ తరుణ్ దండయాత్ర మాత్రం బాక్సాఫీస్ మీద కొనసాగుతూనే వుంది. వచ్చిన సినిమా వచ్చినట్లే పోతున్నా.. రాజ్ తరుణ్‌తో సినిమాలు చేసేవాళ్ళు ఇంకా వున్నారంటే.. ఆశ్చర్యకరమే.
కాస్త ఫోకస్ పెట్టి, ఇంకాస్త జాగ్రత్తగా సినిమాలు చేస్తే, రాజ్ తరుణ్ సినిమా కెరీర్ గాడిన పడుతుందేమో.! చేసుకున్నోడికి చేసుకున్నంత.. అసలు తప్పంతా రాజ్ తరుణ్‌దే అంటారు చాలామంది.