Rakesh Master Choreographer.. అసలు ఎవరీ రాకేష్ మాస్టర్.? జబర్దస్త్‌లో కొన్ని కామెడీ స్కిట్స్ చేశాడు.. అతనేనా.?
కాదు కాదు, యూ ట్యూబ్‌లో ట్రెండ్ సెట్టరా.? ఔనేమో.. అంతేనేమో.1 అంతే కాదు, చాలా వుంది.
రాకేష్ మాస్టర్ అంటే, డాన్స్ కొరియోగ్రాఫర్.! ఔను, పలు తెలుగు సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ప్రభాస్ లాంటి స్టార్స్‌కి డాన్స్‌లో ట్రెయినింగ్ ఇచ్చాడు.
Rakesh Master Choreographer.. ఇలా అయిపోయాడేంటి.?
యూ ట్యూబ్ ఛానళ్ళ ట్రెండ్‌లో రాకేష్ మాస్టర్ పేరు మార్మోగిపోయింది. ఆయన ఇంటర్వ్యూలకు లక్షల్లో వ్యూస్ పోటెత్తేవి.!
ఇంతకీ, రాకేష్ మాస్టర్.. యూ ట్యూబ్ ఛానళ్ళను క్యాష్ చేసుకున్నాడా.? లేదా.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్.

‘మందు బాటిల్ చూపిస్తే చాలు.. లొట్టలేసుకుంటూ వచ్చేస్తాడు..’ అని చాలామంది అంటుండేవారు.
తప్ప తాగి నానా యాగీ చేయడం.. యూ ట్యూబ్ ఛానళ్ళలోనే వైరల్ అయ్యింది.
చివరి వీడియో కూడా అదే..
బూమ్ బూమ్.. అనే బ్రాండ్ మద్యాన్ని తాగుతూ, ఓ వీడియో విడుదల చేశాడు రాకేష్ మాస్టర్.. చనిపోవడానికి జస్ట్ కొన్ని రోజుల ముందు.
అంతే, అదే అతని చివరి వీడియో అయ్యింది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శరీరంలో ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు.
పోయినోళ్ళంతా మంచోళ్ళే.! కానీ, నోటికి ఎంత మాటొస్తే అంత మాటా అనేసి.. కెరీర్‌ని చంపేసుకున్నాడు రాకేష్ మాస్టర్.
ఇక, మద్యపానం విషయానికొస్తే.. చనిపోవడానికి జస్ట్ కొద్ది రోజుల ముందర కూడా మద్యం సేవిస్తూ వీడియో విడుదల చేశాడు.
‘బూమ్ బూమ్ బ్రాండ్ మద్యం’ అట.! ఎండాకాలంలో.. నా ఖర్మ కొద్దీ బీర్ చల్లగా లేదంటూ వాపోయాడు.!
అదే అతని తీవ్ర అనారోగ్య సమస్యకి కారణమా.? ఏమో, షూటింగ్ కోసం విశాఖ వెళ్ళి.. అక్కడే అనారోగ్యానికి గురై.. హైద్రాబాద్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు రాకేష్ మాస్టర్.
Mudra369
గుండు.. ఆపై ఓ పిలక.. ఇదీ రాకేష్ మాస్టర్ అంటే.! అలా తయరయ్యారాయన యూ ట్యూబ్ ఇంటర్వ్యూల తర్వాత. శరీరం నిండా టాట్లూలు కూడా.!
వివాదాస్పద వ్యాఖ్యలతో యూ ట్యూబ్ ఛానళ్ళకు బోల్డంత కంటెంట్ ఇచ్చి, ఆయా ఛానళ్ళు ఆర్థికంగా బలోపేతమవడానికి కారణమయ్యాడు రాకేష్ మాస్టర్.
Also Read: Malavika Mohanan.. మాళవికం.. కట్టి పడేసే అందాల సోయగం.!
ఇంతకీ, అలా చేయడం ద్వారా, ఆయనకు ఆర్థికంగా ఏమైనా మేలు చేకూరిందా.? ఏమోగానీ.. ఆ వివాదాలు.. ఆయన్ని సినీ పరిశ్రమకు మరింత దూరం చేసిన మాట వాస్తవం.
తొక్కేశారా.? స్వయంకృతాపరాధమా.? కారణం ఏదైతేనేం.. బోల్డం తభవిష్యత్ వున్న కొరియోగ్రాఫర్.. అర్థాంతరంగా తనువు చాలించాడు. రెస్ట్ ఇన్ పీస్.. రాకేష్ మాస్టర్.!