Ram Charan BEAST RC16.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? ఔను, బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమా గురించి ఓ అప్‌డేట్ అయితే వచ్చింది.!
నిజానికి, ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్ళాల్సిన సినిమా ఇది. కానీ, అనివార్య కారణాల వల్ల వెనక్కి వెళుతూ వస్తోంది.
ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది రామ్ చరణ్ నుంచి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత, ‘ఆచార్య’ నిరాశపర్చిన దరిమిలా, రామ్ చరణ్ తదుపరి రిలీజ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఈ ఏడాది ‘గేమ్ ఛేంజర్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందో రాదో తెలియని పరిస్థితి.! ఈ గందరగోళం నడుమ, బుచ్చిబాబు సన సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోందన్నది కాస్త ఊరటనిచ్చే విషయమే.
Ram Charan BEAST RC16.. ‘బీస్ట్ మోడ్’..
రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ‘బీస్ట్ మోడ్’ అంటూ ఓ ఫొటోని షేర్ చేశాడు. తన తదుపరి సినిమా కోసం ఫిట్నెస్ పరంగా సన్నద్ధమవుతున్నాడు రామ్ చరణ్.
ఫిట్‌నెస్ ట్రెయినర్ పర్యవేక్షణలో రామ్ చరణ్, ఫిట్‌నెస్ కోసం కసరత్తులు చేయబోతున్నాడన్నది ఈ ఫొటో సారాంశం.
బీస్ట్ మోడ్.. అంటే, కండలు తిరిగిన శరీరంతో కనిపించబోతున్నాడన్నమాట రామ్ చరణ్. అంతలా, స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే.