Ram Charan Game Changer మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది.! ‘సీఈఓ’ అనీ, ఇంకోటనీ.. రకరకాల టైటిళ్ళు ప్రచారంలోకి వచ్చాయిగానీ, అవేవీ నిజం కాదు.!
శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. రాజకీయం, ఎన్నికల వ్యవస్థ.. వీటిపై శంకర్ మార్కు సినీ అస్త్రమిది.!
రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తొలి సినిమా ఈ ‘గేమ్ ఛేంజర్’. చిరంజీవితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్న చరణ్, ఆ చిరంజీవి తనయుడితో ఈ సినిమా చేస్తున్నాడు.
Ram Charan Game Changer.. గేమ్ చేంజర్.. ఇది వేరే లెక్క.!
ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క.! ఔను, ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ రివీల్ చేస్తూ విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.!
చెస్ బోర్డ్‌లోని కింగ్‌ని.. దాన్ని ఎన్నికల ముద్రగా చూపించడంతో.. కథానాయకుడి (Gam Changer) పాత్ర ఇదేనని స్పష్టమవుతోంది.
కేవలం సినిమాలోనే కాదు, సినీ రంగంలోనే రామ్ చరణ్‌ని (Global Star Ram Charan) గేమ్ ఛేంజర్.. అని శంకర్ ఫిక్సయిపోయినట్లున్నాడు.
విలక్షణ చిత్రాలు తీసి, దేశం దృష్టిని ఆకర్షించిన వెరీ వెరీ స్పెషల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar).. ఈ ‘గేమ్ ఛేంజర్’తో ఎలాంటి మార్పులు తీసుకురానున్నాడో వేచి చూడాల్సిందే.