మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమా నుంచి ఉగాది సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ విడుదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan Pooja Hegde In Acharya) ఈ చిత్రాన్ని నిర్మించడమే కాదు, ఇందులో ‘సిద్ధ’ అనే పాత్రలో నటించనున్నాడు కూడా.
ఇప్పటికే ‘సిద్ధ’ పాత్రని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ‘ఆచార్య’ (Acharya Movie) సినిమా నుంచి విడుదలయ్యింది. తాజాగా, పూజా హెగ్దే పాత్రని పరిచయం చేస్తూ ఇంకో పోస్టర్ ఉగాది సందర్భంగా విడుదల చేశారు చిత్ర దర్శక నిర్మాతలు.
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), ఈ పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘ఆయుధమైనా.. అమ్మాయి అయినా సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది..’ అంటూ ట్వీటేశారు. మెగాస్టార్ చిరంజీవి కదా.. ఆయన ఏం చెబినా, అందులో ఛమత్కారం వుంటుంది మరి.
పూజా హెగ్దే (Pooja Hegde), గతంలో ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమా కోసం చరణ్ సరసన ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ‘జిగేలు రానీ’ అంటూ చరణ్ (Mega Power Star Ram Charan) – పూజా హెగ్దే వేసిన స్టెప్పులు అప్పట్లో పెను సంచలనం. ఇప్పుడిక సిద్ధుడితో నీలాంరిగా జతకడుతున్న పూజా హెగ్దే ‘ఆచార్య’ సినిమాతోనూ మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకునేలా వుంది.
స్టిల్ చూస్తోంటే, ఇది కూడా ఓ పాటలోనిదేనా.? అన్న అనుమానం కలగకమానదు. చిరంజీవి అన్నారని కాదుగానీ, సిద్ధుడి చేతిలో నీలాంబరి అత్యద్భుతంగానే ఒదిగిపోయింది. అయితే, దర్శకుడు కొరటాల శివ మాత్రం, షడ్రుచుల సమ్మేళనం మా ‘సిద్ధ – నీలాంబరి’ల ప్రేమ (Ram Charan Pooja Hegde In Acharya).. అంటూ పేర్కొనడం గమనార్హం.