Ram Charan Quite Warning.. ‘మెగాస్టార్ చిరంజీవి సౌమ్యుడు.. ఆయన క్వైట్‌గా వుంటారు.. కానీ, మేం ఆయనలా కాదు. ’ అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
చిరంజీవి క్వైట్‌గా వుంటేనే.. వేలాది, లక్షలాది, కోట్లాది మంది ఆయన వెంట వున్నాం.. ఆయన్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకునేది లేదు.. అంటూ రామ్ చరణ్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాడు.
‘వాల్తేరు వీరయ్య’ సినిమా విజయోత్సవ వేడుకలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Ram Charan Quite Warning.. హెచ్చరికలు ఎవరికి.?
ఈ మధ్యకాలంలో చిరంజీవిని తరచూ కొందరు తూలనాడుతున్నారు. ఆ లిస్టులో సినీ నటి, నగిరి ఎమ్మెల్యే, మంత్రి రోజా సహా మరికొందరు వైసీపీ నేతలున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సౌమ్యుడు.! ఆయన ఏమీ అనరు కాబట్టి, ఆయన మీద నోటికొచ్చిన విమర్శలు చేస్తుంటారు కొందరు. అదే వారి జీవనాధారమైపోతోంది ఇటీవలి కాలంలో.!
కానీ, పదే పదే కుక్కలు మొరుగుతోంటే, ఏనుగుకి చిరాకు రాకుండా వుంటుందా.?
Mudra369
వారిని ఉద్దేశించే రామ్ చరణ్ హెచ్చరించాడా.? పైగా, ‘క్వైట్‌గానే చెబుతున్నాం’ అంటూ, స్వీట్ వార్నింగ్ రామ్ చరణ్ ఇచ్చాడంటే, విషయం పెద్దదే అయి వుంటుంది.
సినీ పరిశ్రమలోనూ వున్నారు..
చిరంజీవి మీద ఘాటైన విమర్శలు చేస్తున్న వ్యక్తులు కొందరు సినీ పరిశ్రమలోనూ వున్నారు. అటు రాజకీయ నాయకులకీ, ఇటు సినీ ఇండస్ట్రీలో కొందరికి నేరుగా రామ్ చరణ్ వార్నింగ్ ఇచ్చాడనే అనుకోవాలి.
‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరైన సంగతి తెలిసిందే.
చిరంజీవి గారు సౌమ్యులు, మంచిగా మాట్లాడతారు అంటుంటారు!
Ram Charan
ఒక్కసారి ఆయన బిగించి గట్టిగా మాట్లాడితే తట్టుకోలేరు.
ఆయన్ని ఎవరైన ఏమైనా అనాలంటే ఫ్యాన్స్, ఫ్యామిలీ మాత్రమే. ఆయన్ని ఏమైనా అంటే ఆయన ఊరుకుంటారెమో.. ఆయన అభిమానులు కాదు.
అయితే, మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫంక్షన్‌కి ఆయనే ముఖ్య అతిథి అనీ, తామంతా అభిమానులమేనని చరణ్ చెప్పడం గమనార్హం.
Also Read: తొక్కినేని ‘మెంటల్’ రచ్చ: నాగచైతన్యకి బాలయ్య మాస్ వార్నింగ్.!
‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూశాక, రవితేజ క్యారెక్టర్ ఇంకా బావుణ్ణనిపించిందనీ.. అందుకే, ఆ వెంటనే ‘ధమాకా’ సినిమా చూశానని చరణ్ చెప్పుకొచ్చాడు.
‘వాల్తేరు వీరయ్య’ పూనకాల్ని తాను అమెరికాలోనూ చూశానని చరణ్ వ్యాఖ్యానించాడు.