కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. ఈ విషయాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందం ఓ వీడియో ద్వారా వెల్లడించింది. మూతబడ్డ గొడౌన్‌ని తెరిచారు.. షూటింగ్ సాముగ్రి దుమ్ము దులిపేశారు.. అహో.. రాజమౌళి కట్ చేయించిన ఈ వీడియో (Rama Raju For Bheem On Oct 22Nd) ఇప్పుడు నెట్టింటో వైరల్‌గా మారింది.
రాజమౌళి ఏం చేసినా సంచలనమే. రాజమౌళి నుంచి అలాంటి సంచనాలను ‘అంతకు మించి’ అనే స్థాయిలో అభిమానులు ఆశిస్తారు. అందుకేనేమో, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి అప్‌డేట్ ఇచ్చేశాడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి.
ఈ నెల 22న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ బహుమతి ఇవ్బబోతున్నాడు. అదే, యంగ్ టైగర్ స్పెషల్. ఇందులో యంగ్ టైగర్‌తోపాటు రావ్‌ు చరణ్ కూడా కనిపించనుండడం గమనార్హం.
మెగా పవర్ స్టార్ గుర్రమ్మీద స్వారీ చేసేస్తోంటే, యంగ్ టైగర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద రయ్యిమని దూసుకెళుతున్న సన్నివేశాన్ని.. బ్లర్ మోడ్‌లో చూపించాడు రాజమౌళి ‘టీజింగ్’ వీడియోలో. రాజమౌళి సినిమాల్లో భారీతనం అందరికీ తెల్సిందే.
ఈ సినిమా మరింత భారీగా వుండబోతోంది. కేవలం అక్టోబర్ 22న విడుదల కానున్న స్పెషల్ వీడియో కోసమే ఈ స్థాయిలో కసరత్తులు చేయడమంటే అది రాజమౌళికే సాధ్యం. వాస్తవానికి ఈ బహుమతిని రామ్ చరణ్, తన కో-స్టార్ ఎన్టీఆర్‌కి మే 20న ఇవ్వాల్సి వుంది. కరోనా నేపథ్యంలో అది వాయిదా పడింది.
ఎలాగైతేనేం, ఈసారి పక్కా.! లేట్ అయినా, చాలా లేటెస్ట్‌గా ఈ అప్‌డేట్ వుండబోతోంది. షూటింగ్ స్టార్ట్ చేస్తున్న విషయాన్ని అత్యద్భుతమైన వీడియోగా కట్ చేసిన రాజమౌళి, కొమరం భీం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఎలాంటి గిఫ్ట్ రామ్ చరణ్‌తో (Rama Raju For Bheem On Oct 22Nd) ఇప్పించనున్నాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.